E-Paper
Advertisement

Viral Video: తల్లి ముందే కూతురుని కారుతో తొక్కేసిన వీడియో వైరల్..

Viral Video: తల్లి ముందే కూతురుని కారుతో తొక్కేసిన వీడియో వైరల్..
Advertisement

Viral Video: నోయిడాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. సెక్టార్-63లో తల్లితో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలికను కారు ఢీ కొట్టింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేరింది. నిందితుడైన కారు డ్రైవర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఈ ఘటన శుక్రవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. ఆమె తల్లి ఎదుటే కారు డ్రైవర్ కూతురిని తొక్కేయడంతో విషాదం నెలకొంది. ప్రమాదం గురించి చుట్టుపక్కల వారితో చెప్పడంతో జనం గుమిగూడారు. గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ అమాయకురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

ఈ ఘటన పోలీస్ స్టేషన్ సెక్టార్-63 ఏరియాలోని సెక్టార్-63ఎలోని బి బ్లాక్‌లో చోటుచేసుకుంది. అక్కడే అద్దెకు ఉంటున్న ఓ మహిళ తన 19 నెలల కుమార్తెను ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ఆడిపిస్తుంది. ఈ తరుణంలో అప్పుడే వేగంగా వచ్చిన కారు చిన్నారిని ఢీ కొట్టింది. అయితే గాయపడిన బాలికను చూసేందుకు కారు డ్రైవర్ వెంటనే కారును ఆపి కారు దిగి వచ్చాడు.

కారు డ్రైవర్ గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన అంతా అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రిలో చిన్నారి చికిత్స తీసుకుంటుంది.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×