Meera Nandan: సినీ ఇండస్ట్రీలో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి. సినిమా చేస్తున్న సమయంలో వేరొక యాక్టర్ లేదా యాక్ట్రెస్‌తో పరిచయం ఏర్పడటం.. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం. ఇక చివరకు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడం. ఈ వ్యవహారం గత కొన్నేళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు, హీరోలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి ఏడడుగులు వేసింది. అలాగే రీసెంట్‌గా సోనాక్సీ సిన్హా తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇక ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కేరళకు చెందిన నటి మీరా నందన్ తాజాగా తన ప్రియుడు బ్యూ శ్రీజును పెళ్లాడింది. వీరి వివాహం తాజాగా గురువాయూర్ ఆలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగింది. వీరి పెళ్లి అతి కొద్ది మంది సన్నిహితులు, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అయితే వీరి మ్యారేజ్ చాలా సింపుల్‌గా గుడిలో జరిగినా.. రిసెప్షన్ మాత్రం అత్యంత గ్రాండ్‌గా ప్లాన్ చేశారని చెబుతున్నారు.
ఏది ఏమైనా నటి మీరా నందన్ ఎంతో కాలంగా ప్రేమలో ఉండి తన ప్రియుడ్ని పెళ్లి చేసుకోవడంతో అభిమానులు, ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం వీరి మీరా నందన్ – శ్రీజు పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక మీరా నందన్ సినిమా కెరీర్ విషయానికొస్తే.. కేరళకు చెందిన నటి మీరా నందన్.. కొచ్చిలో పుట్టి పెరిగింది. ముందుగా ఆమె యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది.
Also Read: హె.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బర్త్ డే గ్లింప్స్
ఆ తర్వాత సీరియల్ నటిగా మరో అడుగు ముందుకేసింది. 2007లో ప్రసారం అయిన ‘వీడు’ అనే సీరియల్‌తో మలయాళ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సీరియల్‌లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇందులో రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వెండితెరపై నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇందులో భాగంగానే 2008లో ‘ముల్లా’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2009లో అఖిల్ హీరోగా నటించిన తమిళ సినిమా ‘వాల్మీకి’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమాతో పరాజయం అందుకుంది. ఇక కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి 2011 లో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ‘జైబోలో తెలంగాణ’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2015లో హితుడు మూవీ, 2017లో 4th డిగ్రీ అనే సినిమాలు చేసింది. అయినా ఈ సినిమాలేవి ఆమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేకపోయాయి. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళంలో కూడా ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మళ్లీ మలయాళం ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అలా చాలా ఒడుదుడులు ఎదుర్కొన్న మీరా నందన్ చిట్ట చివరికి ప్రేమించి పెళ్లి చేసుకుంది.