BigTV English

Viral Video: హాస్టల్ మెస్‌లో వంట చేస్తున్న కడిలో ఎలుక.. ఈ తకొడుతూ దర్శనమిచ్చిన వీడియో వైరల్

Viral Video: హాస్టల్ మెస్‌లో వంట చేస్తున్న కడిలో ఎలుక.. ఈ తకొడుతూ దర్శనమిచ్చిన వీడియో వైరల్

Viral Video: ఫుడ్‌కి సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ముఖ్యంగా ఇందులో కొన్ని వీడియోలు చూస్తే షాకింగ్‌గా అనిపిస్తుంటుంది. పలు చోట్ల ఆహారంలో సాలె పురుగు, చనిపోయిన ఎలుక, బల్లి వంటివి కనిపిస్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా రైలు, విమానం లేదా హాస్టల్ మెస్‌ వంటి వాటిల్లో వెలుగుచూస్తుంటాయి. అంతేకాదు కానీ కొన్నిసార్లు పెద్ద రెస్టారెంట్లలో కూడా నిర్లక్ష్యంతో ఇలాంటి ఘటనలు చాలానే బయటకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ హాస్టల్ మెస్‌కు సంబంధించిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కూరలో ఎలుకను చూసి విద్యార్థులు షాక్ అయ్యారు.


కూరలో ఈతకొట్టిన ఎలుక

హైదరాబాద్‌లోని సుల్తాన్‌పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీలో ఈ ఘటన వెలుగు చూసింది. హాస్టల్ మెస్ లో విద్యార్థుల కోసం తయారుచేసిన వంటకంలో (కూరలో) ఎలుక ప్రత్యక్షమైంది. మెస్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు పెట్టే భోజనంలో ఎలుక దర్శనమిచ్చింది. ఓ పాత్రలో కూర వండి ఉండగా.. అందులో సజీవ ఎలుక ఈతకొడుతూ కనిపించింది. దీనిని చూసిన కొంతమంది విద్యార్థులు షాక్ అయ్యారు. దీంతో వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. విద్యార్థుల భోజనం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై అధికారులు స్పందించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


ఏది ఏమైనా మెస్‌లో భోజనం విషయంలో ఈ విధమైన అజాగ్రత్తను చూసి విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ “ఆ హాస్టల్ మేనేజ్‌మెంట్‌ నచ్చకపోతే ఖాళీ చేయాలని అన్నారు. తనకు ఎదురైన ఓ అనుభవాన్ని కూడా నెటిజన్లతో పంచుకున్నారు. తనకు ఒకసారి ఇలాంటి పరిస్థితే ఎదురైతే వారిని ప్రశ్నించగా తన అడ్వాన్స్ పేమెంట్ తీసుకున్నారని మండిపడ్డారు” ఇండియాలో ఇంట్లో వండిన ఆహారాన్ని తినడం మంచిది’ అని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

DMart: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

Big Stories

×