BigTV English

Suicide: ప్రేమ పెళ్లంటూ యువకుల టార్చర్‌, భరించలేక యువతి సూసైడ్

Suicide: ప్రేమ పెళ్లంటూ యువకుల టార్చర్‌, భరించలేక యువతి సూసైడ్

Nalgonda Harassment Is The Reason For The Death Of The Young Woman: దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా సరే ఆగంతకుల ఆగడాలకు అద్దు అదుపులేకుండా పోతోంది. ఇక తెలంగాణలోనూ రాష్ట్రప్రభుత్వం షీటీమ్స్, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా, నిందితులకు ఎన్ని శిక్షలు వేసిన ప్రేమోన్మాదులు రెచ్చిపోతున్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఒకే వీధిలో ఉండే ఇద్దరు యువకులు ఎదురుగా ఉండే యువతిని అదే పనిగా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అంతేకాదు పెళ్ళి చేసుకోవాలని ఒకరు, లవ్ చేయాలని మరొకరు అదేపనిగా ఆ యువతిని వేధింపులకు గురిచేశారు.లేదంటే వాట్సాఫ్‌, ఇన్‌స్టాలో నీ ఫొటోలను మార్పింగ్ చేసి పెడుతామని బెదిరించారు. దీంతో ఆ యువకుల టార్చర్ భరించలేక ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనా నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం చింతలగూడెం గ్రామంలో జరిగింది. ఇదే గ్రామానికి చెందిన కొత్త రామలింగం రజిత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కల్యాణి పాలిటెక్నిక్‌ కంప్లీట్‌ చేసి హైదరాబాద్ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. కొంతకాలంగా ఆమె ఇంటి వద్దే ఉంటోంది.


ఇదే గ్రామానికి చెందిన ఆరూరి శివ, కొమ్మనబోయిన మధులు స్థానికంగా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు.ఒకే ఊరు కావడంతో ఇద్దరు కూడా కల్యాణిని ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని ఆమెకు ఫోన్లు తరుచుగా చేయడం స్టార్ట్ చేశారు. అంతేకాదు ఇద్దరిది ఒకే ఊరు కావడంతో తమ పరిచయాన్ని ఆసరాగా చేసుకొని తనను ప్రేమించాలని శివ, తనను మ్యారేజ్ చేసుకోవాలని మధులు పదే పదే విసిగించడం స్టార్ట్ చేశారు. వీరిద్దరి టార్చర్ భరించలేని కల్యాణి వారిద్ధరిని రిజెక్ట్ చేసింది. వారి నెంబర్లు బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టింది. దీంతో శివ, మధు ఇద్దరు కలిసి వారిద్దరి వాట్సాప్‌లో ఆమె డీపీగా పెట్టుకున్న ఫొటోలను తీసుకొని వాటిని తమ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పెట్టుకుంటామని బెదిరించారు. తాము చెప్పింది వినకపోతే బాగుండదని హెచ్చరించారు. పదే పదే వారిద్దరి టార్చర్ భరించలేక కల్యాణి ఇంట్లో ఎవరు లేని టైమ్‌లో పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది.దీంతో వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.

Also Read: ఫోన్ ట్యాపింగ్‌‌తో నాకు సంబంధమే లేదు.. ప్రభాకర్‌రావు సంచలన లేఖ!


అనంతరం గ్రామస్థులు, కుటుంబసభ్యులు హుటాహుటినా మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కళ్యాణి మృతి చెందింది. దీంతో మృతురాలి తల్లిదండ్రులు బంధువుల రోదనలు మిన్నంటాయి.మృతురాలి మరణ వాంగ్మూలం జడ్జికి ఇచ్చింది. దీంతో తన మరణానికి కారకులయ్యారని పేర్కొంది. దీంతో మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నిందితులు పరారీలో ఉండటంతో గ్రామస్థులు సైతం నిందితలను త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు.

Tags

Related News

Pocharam Dam: డేంజర్‌లో పోచారం డ్యామ్.. 10 ఊర్లు ఖతమ్..!

Local Body Elections: పంచాయతీ ఎన్నికలకు డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

Kamareddy floods: తెలంగాణలో వర్ష బీభత్సం.. నీట మునిగిన కామారెడ్డి పట్టణం, రెసిడెన్షియల్ విద్యార్థులు సేఫ్

Schools holiday: ఆ జిల్లాలలో రేపు పాఠశాలలకు సెలవు.. బయటికి రావద్దంటూ హెచ్చరిక!

Hyderabad fire accident: హైదరాబాద్‌లో మళ్లీ అగ్ని అలజడి.. పెట్రోల్ బంక్‌లో మంటలు.. ఆ తర్వాత?

Aghapur Ganesh: గణపయ్య ఈసారి సీఎం రేవంత్ లుక్‌లో.. అఘాపూర్‌లో అలరించే విగ్రహం!

Big Stories

×