EPAPER

NEET-UG 2024 Supreme Court: నీట్‌ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌‌పై కేంద్రం అఫిడవిట్..సుప్రీంకోర్టులో విచారణ!

NEET-UG 2024 Supreme Court: నీట్‌ పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌‌పై కేంద్రం అఫిడవిట్..సుప్రీంకోర్టులో విచారణ!

Supreme Court on NEET paper leak(Telugu news headlines today): నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు చేరింది. ఈ పరీక్ష వ్యవహారంపై గురువారం సుప్రీంకోర్టులో కీలకమైన విచారణ జరగనుంది. ఈ పరీక్షలో జరిగిన అవకతవకలు, మాల్ ప్రాక్టీసు, పేపర్ లీకేజీ వంటి వ్యవహారాల నేపథ్యంలో దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈనెల 8న విచారణ జరిపింది. అనంతరం జూలై 11కు వాయిదా వేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కీలక విషయాలు వివరించింది.


వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్షలో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరిగిందనడానికి, విద్యార్థులు లబ్ధిపొందేలా అక్రమాలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. కాగా, నీట్ యూజీ ఫలితాలపై డేటా ఆధారంగా మాల్ ప్రాక్టీస్‌పై నివేదిక ఇవ్వాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ మద్రాస్ ఐఐటీని కోరిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఐఐటీ అధ్యయనం చేసిన నివేదికను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.

నీట్ యూజీ పరీక్షలో అనుమానిత కేసులను గుర్తించడం, అత్యుత్తమ పనితీరు కనబర్చిన అభ్యర్థులు ఎంతమంది ఉన్నారనే విషయాలను మద్రాస్ ఐఐటీ అంచనా వేసింది. ఇందులో భాగంగా 2023, 2024 ఏడాదిలో టాప్ ర్యాంకులను మద్రాస్ ఐఐటీ విశ్లేషించింది. మాల్ ప్రాక్టీస్ జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో విద్యార్థులకు లబ్ధి జరిగిందా అనే కోణంలో పరిశీలించింది. అయితే ఎలాంటి ఆధారాలు లేవని మద్రాస్ ఐఐటీ అభిప్రాయపడింది. సిలబస్ 25 శాతం తగ్గించడంతో ఫలితాలపై ప్రభావం చూపించినట్లుగా వెల్లడించింది.


Also Read: జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

మార్కులు సాధారణంగానే ఉన్నాయని సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. నీట్‌(యూజీ)పై ఇవాళ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ అఫిడవిట్‌ సమర్పించింది. 2024-25 సంవత్సరానికిగానూ అండర్ గ్రాడ్యుయేట్ సీట్లకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియ, జులై మూడో వారం నుంచి నాలుగు రౌండ్లలో నిర్వహించనున్నట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన అదనపు అఫిడవిట్‌లో కేంద్రం వెల్లడించింది.

విచారణ 18కి వాయిదా..

సుప్రీంకోర్టుకు కేంద్రం, ఎన్టీఏ అఫిడవిట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కొంతమంది పిటిషనర్ల తరపు న్యాయవాదులకు కేంద్రంచ ఎన్టీఏ దాఖలు చేసిన అఫిడవిట్లు ఇంకా అందలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. ఈ వాదనలకు ముందు తమ ప్రతిస్పందనను తెలిపేందుకు వారికి సమయం కావాలని చెప్పింది. ఈ మేరకు నీట్ యూజీ 2024పై దాఖలైన పిటిషన్లపై విచారణను జూలై 18కి వాయిదా వేసింది.

Tags

Related News

Supreme Court: సుప్రీంకోర్టు కీలక తీర్పు.. వయసు నిర్ధారణకు ఆధార్ ప్రామాణికం కాదు

Supreme Court: తదుపరి సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా.. నవంబర్‌ 11న ప్రమాణస్వీకారం

RAJNATH SINGH : గస్తీ ఒప్పందం విజయవంతంపై రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు… చర్చలకు ఉండే శక్తే వేరు అంటూ కితాబు

Bengaluru Traffic: బెంగళూరులో ప్రత్యక్ష నరకం, రోడ్ల మీదే కార్లు వదిలేసి వెళ్లిపోయిన టెక్కీలు!

Ajit Pawar : మహా ఎన్నికల్లో కీలక పరిణామం, అజిత్‌ పవార్‌కు సుప్రీం గ్రీన్ సిగ్నల్, ఇక ఆ గుర్తు మీదే !

India Export Webley-455: మేడ్ ఇన్ ఇండియా తుపాకులు అమెరికాకు ఎగుమతి.. ఉత్తర్ ప్రదేశ్ లో తయారీ

Maharashtra Polls MVA: మహారాష్ట్రలో కుదిరిన ప్రతిపక్షాల పొత్తు.. ఇండియా కూటమి 85-85 సీట్ షేరింగ్‌

Big Stories

×