BigTV English

Viral Video: ఏంటండీ ఈ విడ్డూరం.. బైక్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంట.. వీడియో చూశారా

Viral Video: ఏంటండీ ఈ విడ్డూరం.. బైక్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంట.. వీడియో చూశారా

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. పలుసార్లు సాధారణ వీడియోలు వైరల్ అవుతుంటే మరికొన్ని సార్లు కొన్ని వీడియోలు ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. సాధారణంగా అయితే మనుషులు బర్త్ డే జరుపుకోవడం చూస్తుంటాం. మరోవైపు ఇష్టంగా పెంచుకునే జంతువుల బర్త్ డేలు కూడా జరుపుకోవడం చూస్తుంటాం. కుక్కలు, పిల్లులకు బర్త్ డేలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తే తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి చేసిన పనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.


ఓ వ్యక్తి విచిత్రంగా తన బైక్ కు బర్త్ డే సెలబ్రేషన్స్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మనుషులు, జంతువులు, చెట్లు ఇలా వీటన్నింటికి బర్త్ డే చేయడం చూస్తే ఈ వ్యక్తి మాత్రం ఓ బైక్ కు బర్త్ డే సెలబ్రేషన్స్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను ఎంతో ఆకర్షిస్తుంది. అయితే ఈ వ్యక్తి తన బైక్ కొని ఏడాది కావడంతో దానికి బర్త్ డే చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బైక్ ను శుభ్రంగా కడిగి, అందంగా అలంకరించాడు. ఈ క్రమంలో దానికి బొట్లు పెట్టి, అందమైన పూల మాల అలంకరించాడు. ఆ బైక్ ను పట్టుకుని ఓ వ్యక్తి ఉండగా మరొక వ్యక్తి బైక్ ముందు కేక్ పట్టుకుని వేడుకలు జరుపుకున్నాడు. అయితే ఆ కేక్ కట్ చేసేందుకు ఆ వ్యక్తి మాత్రం ముందుకు రాలేదు. బైక్ తోనే కేక్ కట్ చేయించాడు. బైక్ టైరుకు కత్తిని కట్టుకుని ముందు ఓ వ్యక్తి కేక్ పట్టుకుని నిల్చుని ఉండగా ఆ వ్యక్తి బైక్ టైరును ముందుకు జరుపుతూ దానితోనే కేక్ కట్ చేయించాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by shivamurthy (@shivamurthy3893)

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×