BigTV English

Devara First Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ పెరగడానికి కారణం అదేనా?

Devara First Review: ‘దేవర’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ పెరగడానికి కారణం అదేనా?

Devara First Review: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’.. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ఆ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్నాడు ఎన్‌టీఆర్. ఇక ఆ మూవీ విడుదలయ్యి మూడేళ్లు అవుతున్న ఇప్పటికీ ఎన్‌టీఆర్ తరువాతి సినిమా థియేటర్లలో సందడి చేయకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఫైనల్‌గా ‘దేవర’తో ఫ్యాన్స్ ఎదురుచూపులకు చెక్ పడనుంది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. విడుదలకు దాదాపు రెండు వారాలు ఉన్నా అప్పుడే ‘దేవర’కు సంబంధించిన మొదటి రివ్యూ బయటికొచ్చింది. ఇటీవల సెన్సార్ బోర్డ్ సినిమాను వీక్షించడంతో ఫస్ట్ రివ్యూను ఇచ్చేసింది.


మొదటి రివ్యూ

‘దేవర’కు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలయ్యింది. ఈ ట్రైలర్‌లో ఎక్కువగా యాక్షన్ తప్పా కథను మాత్రం ఎక్కడా రివీల్ చేయడానికి ట్రై చేయలేదు దర్శకుడు కొరటాల శివ. కథ గురించి పక్కన పెడితే ‘దేవర’లో యాక్షన్ ఉన్నా కూడా అది ఇతర సినిమాల్లోని యాక్షన్‌తో పోలిక లేకుండా కొత్తగా ఉందని, దానికి విజువల్స్ కూడా ప్లస్ అయ్యాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ట్రైలర్ లాగానే మూవీ కూడా ఉంటే కచ్చితంగా ఎన్‌టీఆర్ నటించిన చిత్రాల్లో ఇదొక గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ బోర్డ్ కూడా దాదాపుగా ఇదే రివ్యూను అందించింది.


Also Read: సింగర్ మనో కుమారులపై కేసు.. మద్యం మత్తులో అమాయకులపై దాడి, అసలు ఏం జరిగిందంటే?

రన్ టైమ్ ఎంతంటే

ఇటీవల ‘దేవర’కు సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమాను పూర్తిగా చూసిన సెన్సార్ బోర్డ్.. దీనికి యూ/ఏ సర్టిఫికేట్ అందించింది. అంతే కాకుండా మూవీ నిడివి కూడా 2 గంటల 57 నిమిషాల 58 సెకన్లు ఉండనున్నట్టు తెలుస్తోంది. అంటే దాదాపుగా ఇదొక మూడు గంటల సినిమా. ‘దేవర’లో యాక్షన్ సీన్స్‌ వల్లే రన్ టైమ్ పెరిగిందని సెన్సార్ బోర్డ్ చెప్పకనే చెప్పింది. ఈ విషయం ట్రైలర్‌తోనే ప్రేక్షకులకు కూడా అర్థమయ్యింది. ఇక ఎన్‌టీఆర్, జాన్వీ కపూర్ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో ఇప్పటికే విడుదలయిన రెండు పాటల్లో చూశారు ప్రేక్షకులు. అలా యాక్షన్‌తో పాటు జాన్వీ కపూర్‌తో లవ్ ట్రాక్ కూడా మూవీకి ప్లస్ అవ్వనుందని తెలుస్తోంది.

బాలీవుడ్ నటీనటులు

‘దేవర’తో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్‌లో ఇప్పటికే తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న జాన్వీకి తెలుగులో మాత్రం ఇదే మొదటి సినిమా. అందుకే ఈ మూవీ హిట్ అవ్వడం తనకు చాలా ముఖ్యం. ఇక ఇందులో విలన్‌గా కూడా బాలీవుడ్ నటుడినే ఎంపిక చేసుకున్నాడు దర్శకుడు కొరటాల శివ. ‘దేవర’లో ఎన్‌టీఆర్‌కు ఎదురుతిరిగే ధీటైన విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఇప్పటికే ట్రైలర్‌లో సైఫ్ అలీ ఖాన్ లుక్స్‌తో పాటు తన విలనిజం కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. మొత్తానికి మూడేళ్ల తర్వాత ఎన్‌టీఆర్ నుండి ఒక ఫుల్ లెన్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది. సెప్టెంబర్ 27 కోసం ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×