BigTV English

Viral Video: ప్రేమగా పెంచుకున్న కుక్కలే ఇంట్లో నిప్పు పెట్టాయి.. వైరల్ వీడియో

Viral Video: ప్రేమగా పెంచుకున్న కుక్కలే ఇంట్లో నిప్పు పెట్టాయి.. వైరల్ వీడియో

Viral Video: పెంపుడు జంతువుల్లో కుక్కలు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వాటిని పెంచుకోవాలని, తరచూ వాటితో ఆడుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ తరుణంలో ప్రస్తుతం ప్రతీ ఒక్కరి ఇంట్లోను కుక్కల పెంపకం జరుగుతుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు మనుషుల కంటే కుక్కలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అవి ఎంతో విశ్వాసంతో, ప్రేమతో ఉంటాయని, మనుషులకు, ఇంటికి కాపలాగా వ్యవహరిస్తాయని నమ్ముతారు. అయితే ఇలా పెంపుడు కుక్కల్లో కూడా చాలా వరకు సాహసాలు చేసి ప్రాణాలు కాపాడినవి ఉంటే మరికొన్ని మాత్రం ప్రాణాలను తీసే ప్రమాదాలను కూడా సృష్టించిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.


తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ప్రస్తుతం మార్కెట్లో ఈ బ్యాటరీల క్రేజ్ బాగా పెరిగపోయింది. సులభంగా వాడగలిగే వీటి కారణంగా ఇటీవల చాలా ప్రమాదాలు వెలుగుచూస్తున్నాయి. అయితే తాజాగా అమెరికాలో జరిగిన ఈ ఘటన ఈ బ్యాటరీల కారణంగా ఓ ఇళ్లంతా తగలబడిపోయింది. అమెరికాలోని ఓక్లహోమాకు చెందిన ప్రాంతంలో ఓ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కుక్కలు ఆటలో భాగంగా ఇంటికే నిప్పంటించాయి. రెండు పెంపుడు కుక్కలు ఉన్న ఓ ఇంట్లో కలిసి ఆడుకుంటూ ఉండగా ఓ కుక్కు నోట్లో నుంచి ఉన్నట్టుండి మంటలు వచ్చాయి.

నోట్లో అది ఈ బ్యాటరీ పెట్టుకోవడంతో మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలను చూసిన కుక్కలు భయాందోళనకు గురయ్యాయి. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీశాయి. అయితే మంటలు వ్యాపించిన సమయంలో ఇంట్లో రెండు పెంపుడు కుక్కలతో పాటు ఒక పిల్లి కూడా ఉంది. ఆ సమయంలో ఇంటి యజమాని ఇంట్లో లేనట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంట్లో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దీంతో ఈ ఘటన కాస్త వెలుగులోకి వచ్చింది. అయితే ప్రమాదం సమయంలో కుక్క నోటిలో లిథియం బ్యాటరీ ఉందని అది నములుతుండగా మంటలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది.


Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×