E-Paper
Advertisement

Veeranjaneyulu Viharayatra Official Trailer: ఈటీవీ విన్ నుంచి మరో ఆణిముత్యం.. ట్రైలర్ అదిరిపోయింది

Veeranjaneyulu Viharayatra Official Trailer: ఈటీవీ విన్ నుంచి మరో ఆణిముత్యం.. ట్రైలర్ అదిరిపోయింది
Advertisement

Veeranjaneyulu Viharayatra Official Trailer: గ్లామర్, వల్గారిటీ, బూతులు.. ఏ ఓటీటీ ఓపెన్ చేసినా ఎక్కువ ఇవే కనిపిస్తాయి. కానీ, ఇన్ని ఓటీటీల నడుమ ప్యూర్ కథ, కామెడీ, కుటుంబ కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న ఓటీటీ ఈటీవీ విన్. #90’s, శశిమథనం వంటి ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో ప్రేక్షకులను అలరించిన ఈటీవీ విన్.. తాజాగా మరో ఆణిముత్యంతో రాబోతుంది. అదే వీరాంజనేయులు విహారయాత్ర.

సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ లో రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, తరుణ, రవితేజ మహాదాస్యం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తుండగా.. బాపినీడు, సుధీర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Advertisement

తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. వీరాంజనేయులుగా హాస్య బ్రహ్మా బ్రహ్మానందం కనిపించాడు. తండ్రి అస్తికలు పేరు చెప్పి గోవా వెళ్లాలని ప్లాన్ చేస్తాడు నరేష్. ఇక కుటుంబాన్ని మొత్తం తనతో తీసుకెళ్తాడు. అయితే ఇంట్లో ఎవరికి వారు యమునా తీరు అన్నట్లు ఉండే ఈ కుటుంబ సభ్యులు గోవా ట్రిప్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.. ? అసలు ఈ ట్రిప్ ను నరేష్ ఎందుకు ప్లాన్ చేశాడు.. ? అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఇక ఈ సిరీస్ ట్రైలర్ చూస్తే.. మలయాళంలో హిట్ అయినా ఫ్యామిలీ అనే సినిమా గుర్తు రాకమానదు. దానికి రీమేక్ గానే ఈ సిరీస్ ను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సిరీస్ ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×