E-Paper
Advertisement

Viral Video: పాపం.. వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో చేయాలని ప్రయత్నించింది.. కానీ చివరికి..

Viral Video: పాపం.. వర్షంలో డ్యాన్స్ చేస్తూ వీడియో చేయాలని ప్రయత్నించింది.. కానీ చివరికి..
Advertisement

Viral Video: వర్షాకాలం మొదలైంది. ఇక వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, చుట్టూ చల్లని గాలి, ఆ సమయంలో వర్షం పడుతుంటే చూడడానికే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అదే ఆ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ ఫీలింగ్ వర్ణనాతీతంగా ఉంటుంది. అయితే ఇలాంటివి చాలా వీడియోల్లోను చూస్తుంటాం. వర్షంలో డ్యాన్స్ లు చేస్తూ, లేదా పాటలు పాడుతూ, తడుస్తూ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాం. వర్షంకు సంబంధించిన పాటలపై గెంతులు వేస్తూ నెట్టింట పోస్ట్ చేసే వీడియోలు తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఓ యువతి కూడా ఇలాంటిదే ఓ వీడియో చేసింది.

వర్షంలో తడుస్తూ వీడియో చేయాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో బంగ్లాపైకి వెళ్లి డ్యాన్స్ చేయాలని ప్రయత్నించింది. అంతేకాదు దీనికి సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో వీడియో కోసం ఫోన్ ను ఓ చోట అమర్చింది. అనంతరం నెమ్మదిగా బంగ్లాపైకి ప్రవేశిస్తున్నట్లు వచ్చింది. వర్షం పడుతుండగా పైకి వచ్చి డ్యాన్స్ చేయాలని చూసింది. అంతేకాదు అందంగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ప్రయత్నించింది. కానీ చివరకు తనకు చేదు అనుభవం ఎదురైంది.

Advertisement

వీడియో చేయాలని వెళ్లిన యువతి ఒక్కసారిగా ‘క్యా మౌసమ్ ఆయా హై’ పాట పాడి టెర్రస్ పై వర్షం నీటిలో తడిసి జారి కింద పడింది. దీంతో తన కాలుకు తీవ్రమైన గాయం అయింది. దీంతో నెమ్మదిగా స్వతహాగా తానే లేచి నడుచుకుంటూ వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. అందుకే వీడియోలు చేసే ముందు జాగ్రత్తలు పాటించాలని, లేకపోతే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×