BigTV English

Karnataka:దే‘ముడా’ ఇదెక్కడి స్కామ్..సిద్ధరామయ్య ఇరుక్కున్నారా?

Karnataka:దే‘ముడా’ ఇదెక్కడి స్కామ్..సిద్ధరామయ్య ఇరుక్కున్నారా?

bjp mps attack on Siddaramaiah MUDA scam in Parliament sessions


పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలలో ‘ముడా’ కుంభకోణంలో కర్ణాటక సీఎం ప్రమేయం ఉందని బీజేపీ కర్ణాటక ఎంపీలు ఆరోపణలు చేస్తూ నిరసన కార్యక్రమాలకు దిగారు. పెద్దల సభలోనూ ఈ ఇష్యూపై పెద్ద రగడే జరిగింది. కాంగ్రెస్ ఎంపీలు సిద్ధరామయ్యకు మత్తుగా నిలిచారు. అసలు ఏమిటీ ‘ముడా’ దేనికి అంత రచ్చ? బీజేపీ ఎంపీలు ఎందుకంత రాద్దాంతం చేస్తున్నారు? ఇంతగా ఆందోళన చేస్తున్న ‘ముడా’ కుంభకోణం ఏమిటి?

సీఎం భార్య పేరిట భూమి


మైసూరు ప్రాంతంలోని కెసరె గ్రామంలో కర్ణాటక సీఎం భార్య కు అక్కడ మూడు ఎకరాల భూమి ఉంది. మొదట్లో కుగ్రామంగా ఉండే కెసరె తర్వాత అక్కడ అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చెందింది. అయితే మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) ఆధ్వర్యంలో ఆ భూమిని స్వాధీనం చేసుకుంది. అందుకు పరిహారంగా 2021 సంవత్సరంలో వేరే ప్రాంతంలో 283 చదరపు అడుగుల ప్లాట్ ను కేటాయించింది. కెసరె ల్యాండ్ కన్నా ఈ భూమి విలువ చాలా ఎక్కువ. పైగా ఈ భూమి విలువ రెట్టింపుగా ఉంది. దానితో బీజేపీ సభ్యులు తీవ్ర ఆందోళనలు చేశారు అప్పట్లో. భూమి విలువకు సరిపడా పరిహారం అయినా ఇవ్వాలి లేదంటే అంతే విలువైన స్థలాన్ని కేటాయించాలి.

అంత ఖరీదైన భూమి కేటాయిస్తారా?

ఇంత ఖరీదైన ప్రాంతంలో భూమి కేటాయింపు అధికార దుర్వినియోగమే. అని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. అందుకు కౌంటర్ గా సీఎం సిద్ధరామయయ ముడా తన భూమిని అక్రమంగా తమ ప్రమేయం లేకుండానే ఆధీనం చేసుకుందని ఆరోపించారు. ఇదంతా తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు బీజేపీ పెద్ద రాజకీయం చేస్తోందని అన్నారు.ఒకవేళ బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా మార్కెట్ ధర కన్నా ఎక్కువగా ఉంటే తనకు తన భూమినే తిరిగి ఇప్పించాలని అన్నారు.

మా ప్రమేయం లేకుండానే కేటాయింపులు

తమ భూమిని మైసూరు నగరాభివృద్ధి సంస్థ అక్రమంగా లాక్కుందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆరోపించారు. తన భార్య పరిహారం పొందేందుకు అర్హురాలని తెలిపారు. విపక్ష నాయకులవి అర్థం లేని ఆరోపణలు అని అన్నారు.ఈ కుంభ కోణంలో రెవెన్యూ అధికారులు కూడా సహకరించారని తెలిపారు. భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. కానీ ఈ భూకేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సిద్దరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని బీజేపీ కూడా డిమాండ్ చేస్తోంది.సిద్ధరామయ్య కుటుంబం నాలుగువేల కోట్లు కుంభకోణం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. తనకేమీ తెలియదని సిద్ధరామయ్య ఈ కేటాయింపులన్నీ బీజేపీ ప్రభుత్వం ఉన్న సమయంలోనే జరిగాయని..అంటున్నారు. ఇప్పుడు ఈ వివాదం కర్ణాటక అసెంబ్లీలో అటు పార్లమెంట్ లోనూ పార్లమెంట్ సభ్యుల ఆరోపణలతో దద్దరిల్లుతోంది. చినికి చినికి గాలివానయ్యేలా ఉంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×