BigTV English

Viral Video: పూలమ్ముతూ కొడుకుకు లక్షన్నర బైక్ కొన్న తండ్రి.. ఈ పోలీస్ అధికారి మాటలు హార్ట్ టచ్ అవుతాయ్!

Viral Video: పూలమ్ముతూ కొడుకుకు లక్షన్నర బైక్ కొన్న తండ్రి.. ఈ పోలీస్ అధికారి మాటలు హార్ట్ టచ్ అవుతాయ్!

Viral Video: కొడుకేనని ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. లక్షన్నర పెట్టి బైక్ కొనుగోలు చేశారు. అయితే ఆ బైక్‌కి నెంబర్ ప్లేట్ లేదు. చివరకు డ్రైవింగ్ చేస్తున్న ఆ యువకుడికి హెల్మెట్ లేదు. తల్లిని ఎక్కించుకుని తిరుగుతూ పోలీసులకు చిక్కాడు. ఆ పోలీసు అధికారి మాటలు వింటే ఎలాంటివారికైనా హార్ట్ టచ్ కావాల్సిందే. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.


గుంటూరు సిటీ.. బుధవారం ఇంజనీరింగ్ స్టూడెంట్ తన తల్లిని బైక్‌పై ఎక్కించుకుని దేవాలయానికి వెళ్లాడు. మార్గ మధ్యలో పోలీసులకు చిక్కాడు. ఇంతకీ ఆ యువకుడి లైఫ్ స్టయిల్ తెలిసి షాకయ్యారు ఆ పోలీసు అధికారి. చివరకు జీవితానికి సంబంధించి కొన్ని పాఠాలు వివరించారు.

ఈ మధ్యకాలంలో యువత ఎక్కువగా బైక్‌లు వాడుతున్నారు. విచిత్రం ఏంటంటే డ్రైవింగ్ చేసేవాడికి అవి కంఫర్ట్‌గా ఉంటాయి. వెనుక కూర్చొన్నవారికి మాత్రం గుండెల్లో దగ పుట్టాల్సిందే. ఆ బైక్‌పై వెళ్లితే ఎలాంటివారైనా మినిమమ్ 80 లేదా 100 వేగంతో బైక్ నడుపుతారు. అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి.


అలాంటి బైక్‌పై తల్లిని తీసుకుని దేవాలయానికి వెళ్లాడు. వెళ్లే దారిలో ట్రాఫిక్ పోలీసుకు చిక్కాడు. ఆయన అడిగే ప్రశ్నలకు ఎత్తిన తల దించుకోవాల్సిన పరిస్థితి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి వంతైంది.

ALSO READ: సైడు నుంచి చూస్తే కారు అనుకుంటారు.. ముందుకెళ్లి చూస్తే

యువకుడి తల్లిదండ్రుల విషయానికొద్దాం.. తల్లిదండ్రులు పూలు అమ్ముతూ జీవనం సాగిస్తారు.  యువకుడి తల్లి.. మెడలో రోల్డ్‌గోల్డ్ ధరించారు. కొడుకు కోరడంతో లక్షన్నర పెట్టి సెకండ్ హ్యాండ్ బైక్ కొనుగోలు చేశారు. దానిపై రయ్ రయ్ మంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే ఆ బైక్‌కి నెంబర్ ప్లేట్ లేదు.. ఆ యువకుడికి హెల్మెట్ లేదు. కనీసం డ్రైవింగ్ లైసెస్సు కూడా లేదు. కానీ బైక్‌పై చక్కర్లు కొడుతున్నాడు.

ఇలాంటి బైక్‌ల వల్ల ఆనందం కంటే అనర్థాలు ఎక్కువని యువకుడి తల్లిని సున్నితంగా హెచ్చరించారు. వీటి మీద వేగంగా వెళ్తారని ,  ఏదో ఒక తప్పు చేయాలని అనిపిస్తుందన్నారు. మంచి పిల్లలు ఈ తరహా  బైక్‌ల వల్ల చెడుగా మారే అవకాశముందన్నారు. తల్లిదండ్రులు కష్టాన్ని బండి మీద పెట్టి కొడుకు జీవితాన్ని రిస్క్‌లో పెడుతున్నారని ఆ తల్లిని మందలించారు. ఈ బండి మార్చేసి తక్కువ డబ్బులతో చిన్న బండి తీసుకోవాలని సూచించారు.

ఆ తర్వాత యువకుడ్ని గట్టిగానే హెచ్చరించారు ఆ పోలీసు అధికారి. మీ అమ్మని బైక్‌పై కూర్చొబెట్టుకుని నడిపే ఛాన్స్ ఉందా?  బైక్ వల్ల ఎక్కువ మార్కులు వస్తాయా? అని యువకుడ్ని ప్రశ్నించారు. బైక్ రాగానే హెయిర్ స్టయిల్ మారింది. చివరకు గెడ్డం కూడా మారిందన్నారు. నీ మైండ్ కూడా మారే ఉంటుందని అన్నారు ఆ పోలీసాయన.

కనీసం బైక్ మార్చితే కనీసం వేషదారణ మారుతుందన్నారు. అప్పుడు చదువు వస్తుందన్నారు. చదివి జీవితంలో సెటిలైతే ఇంకా మంచివి  తీసుకోవచ్చని సూచన చేశారు. నెంబర్ సంగతి ఏంటి? హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? డ్రైవింగ్ లైసెన్సు ఎక్కడ అనేసరికి కళ్లు తేలేశాడు బీటెక్ స్టూడెంట్. ఇవేమీ లేకుండా రోడ్డు ఎలా తిరుగుతున్నారని తల్లితోపాటు కొడుకుని తనదైన శైలిలో ప్రశ్నించారు.

నెంబర్ ప్లేట్ తీసుకుని తన వద్దకు వస్తే అప్పుడు బైక్ ఇస్తానని పోలీసు అధికారి అన్నారు. ఈలోపు అమ్మని ఆటో ఎక్కించి ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టి, వచ్చేటప్పుడు బైక్‌కి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని గట్టిగానే హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×