Tirumala Game App: గేమర్లు తిరుమల ఆలయాన్ని కూడా వదలడం లేదు. ఆలయంలోకి ఎలా ప్రవేశించాలి.. ఎలా దర్శనం చేసుకోవాలి అనే విషయంపై ఓ గేమ్‌ను రూపొందించారు. ఇప్పటికే ఈ గేమ్ ప్లే స్టోర్‌లో దొరుకుతుంది. ఇందులో ఆలయంలోకి ఎంట్రీని నుంచి స్వామివారి దర్శనం వరకు అన్నింటిని చూపించారు. అయితే ఇది ఆలయంలోని భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది. ఇప్పటికూ ఈ అంశం పై విజిలెన్స్ అధికారులు విచారణ చెపడుతున్నారు.
తిరుమల వెంకన్న దర్శనంపై గేమింగ్ యాప్ :
తిరుమల ఆలయంకు సంబంధించి గెమర్లు ఒక విడియే రిలీజ్ చేశారు. ఆలయంలోకి ఎలా ప్రవేశించాలి, ఎలా దర్శనం చేసుకోవాలి అనే విడియోను అన్‌లైన్లో రూపొందించారు. అయితే వీరిపై కఠిన చర్యలు తీసుకుని ఆ విడియని తొలగించే ప్రయత్నం కూడా చేస్తు్న్నారు. ఎందుకంటే ఆలయ భద్రతకు ఈ విడియో ఎంతో ముప్పు తెస్తుందని చెబుతున్నారు. అయితే మనం చూస్తు ఉంటాం తిరుమలకు ఎంత మంది భక్తులు వస్తుంటారు.. దర్శనం కోసం కొన్ని వేళల్లో, కొన్ని లక్షల్లో ప్రజలు వస్తుంటారు. అలాంటి పవిత్రమైన తిరుమలకు సంబంధించి ఇలాంటి విడియో బయటకు రావడం చర్చనియాంశంగా మారింది. అయితే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని చూడాలి.
మోసగిస్తున్న roblox కంపెనీ:
తిరుమల శ్రీవాలి ఆలయం మహాద్వారం నుంచి ప్రతి మార్గాన్ని చూపించిన ఒక విడియో గేమెను అప్లోడ్ చేసి సోషల్ మిడియాలో ఉంచాడు. ప్లే స్టోర్స్ నుంచి డౌన్ లోడ్ చేసుకోడానికి వీలుగా ఏర్పాటు చేశారు. దీనిపై గత మూడు రోజులుగా టిటిడి విజిలెన్స్ అధికారులు ఎక్కడి నుంచి ఎవరు అప్లోడ్ చేశారు అనేదాని విచారణ కొనసాగుతుంది. తాజాగా ఈ విషయాన్ని జనసేన నాయకుడు కిరణ్ రాయల్ టిటిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడుకు దృష్టికి తీసుకు వెళ్లడానికి వెళ్లారు. మొత్తం మీద ఈ విషయం పై భక్తులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ ఘటన సంచలనం కలిగించిందని చెబుతున్నారు.
Also Read: మంత్రులకు కొత్త సవాల్.! పదవుల కోసం రాంగ్ సిగ్నల్స్ కరెక్టా?
ముఖ్యంగా ఏదైతే భక్తుల తిరుమల ఆలయాంలో ప్రతి ఒక్కటి పవిత్రంగా భావిస్తారో.. ఇక్కడ విడియో గేమర్స్ దీన్ని ఒక ఆటగా వ్యతిరేకించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తు్న్నారు. గతంలో కూడా ఇలాంటివి చాలా సోషల్ మీడియాలో తిరుమలకు వచ్చి రీల్స్ చేయడంపై భక్తులు నిరసించారు. సెలబ్రేటిల మీద కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఏకంగా ఆనంద నిలయంలోకి ఎలా ప్రవేశిస్తారు అలాంటి విషయాలను ఏకంగా గేమ్‌లు చిత్రికరించడం దానిని అప్లోడ్ చేయడంపై ఆలయ భద్రతకు ఇబ్బందులు కలిగే ప్రమాదం ఉందని తెలిపారు.