BigTV English

World’s Tiniest Car: సైడు నుంచి చూస్తే.. కారు అనుకుంటారు.. ముందుకెళ్లి చూస్తే మబ్బు విడిపోద్ది!

World’s Tiniest Car: సైడు నుంచి చూస్తే.. కారు అనుకుంటారు.. ముందుకెళ్లి చూస్తే మబ్బు విడిపోద్ది!

World’s Tiniest Car Viral Video: ప్రపంచంలో చాలా మందికి వింత వింత ఆలోచనలు వస్తాయి. ఆలోచన రావడమే కాదు, వాటిని నిజం చేసే ప్రయత్నం చేస్తారు మరికొంత మంది. అలాగే ఓ ఇటాలియన్ ఆవిష్కరక్త తాజాగా ఓ అదిరిపోయే కారును తయారు చేశాడు. ఆయన ఆవిష్కరణను చూసి అందరూ అవాక్కయ్యారు. అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆయన ఏం కనిపెట్టారంటే..


ప్రపంచంలోనే అత్యంత సన్నని కారు తయారీ

ప్రపంచంలో చాలా రకాల కార్లు ఉన్నాయి. వాటిలోకి కొన్ని వింతగా ఉన్నాయి. అలాంటి కోవలోకే వచ్చింది మరోకారు. ఫియట్ పాండా ను ప్రపంచంలోనే అత్యంత సన్నని కారుగా మలిచాడు ఓ ఇటాలియన్ ఆవిష్కర్త. ప్రస్తుతం ఈ కారుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ కారులో చక్కగా ఓ వ్యక్తి కూర్చొని నడపడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.


సైడు నుంచి చూస్తే సాధారణ కారు లాగే!

ఫియట్ కారును మోడిఫై చేసి.. అత్యంత సన్నని కారుగా రూపొందించాడు ఓ వ్యక్తి.  తాజాగా ఈ కారును రోడ్డు మీదికి తీసుకొచ్చాడు. ఈ కారుకు సాధారణ కారుకు ఉన్నట్లుగానే నాలుగు చక్రాలు ఉన్నాయి. అయితే, వాటి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది. ఒక వ్యక్తికి మాత్రమే సరిపోయేలా దీనిని రూపొందించాడు. సదరు వ్యక్తి దానిలో కూర్చొని హాయిగా ప్రయాణిస్తూ కనిపించాడు. హాయిగా నవ్వుతూ జాలిగా వెళ్లాడు.

Read Also: కారు, ల్యాప్ టాప్, ఐఫోన్ తో సహా ఇంట్లో వస్తువులన్నీ రెండు ముక్కలు చేసిన భర్త.. కోర్టు తీర్పు ఇలా అర్థమైందా?

ఫన్నీగా కామెంట్స్ చేస్తున్న నెటిజన్లు

చాలా మంది ఈ వింతకారుకు సంబంధించిన వీడియోలను తమ సెల్ ఫోన్లలో బంధించారు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ కారును చూసి అందరూ షాక్ అవుతున్నారు. మరికొంత మంది ఫన్నీగా జోకులు వేస్తున్నారు. మరికొంత మంది ఇదేం పిచ్చిరా బాబోయ్ అంటున్నారు. “కారు కచ్చితంగా బడ్జెట్ ధరలో ఉంటుందని భావిస్తున్నాం” అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు. అటు “మోటార్ సైకిల్ రేసర్ల మాదిరిగా అతడు కూడా ఈ కారుతో స్పీడ్ గా పరిగెత్తించాలని కోరుకుంటున్నా” అని మరో వ్యక్తం రాసుకొచ్చాడు. “మ్యాథ్స్ క్వశ్చన్: జాన్ కారు చుట్టు కొలత ఏంటి? సమాధానం: 20 సెం. మీ పొడవు, 4 సెం. మీ వెడల్పు” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. “అరే ఈ వ్యక్తి న్యూయార్క్ అపార్ట్ మెంట్ నడుపుతున్నాడు” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “అరే ఇది టూత్ పిక్ లా కనిపిస్తుందిగా” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. క్రేజీ కారు నెటిజన్లలో క్రేజీ ఫీలింగ్ కలిగిస్తోంది. అంతేకాదు, క్రేజీగా రియాక్షన్స్ ఇస్తున్నారు.

Read Also: తల మీద కారు.. 14 సెకెన్లలో 100 మీటర్ల పరుగు, ఈ అరుదైన వ్యక్తుల గురించి మీకు తెలుసా?

Related News

Viral Video: డెలివరీ బాయ్ ను చేజ్ చేసిన 10 మంది పోలీసులు.. అసలు ఏమైందంటే?

Viral Video: గర్బా ఈవెంట్ లో ముద్దులు.. క్షమాపణ చెప్పి దేశం విడిచి వెళ్లిపోయిన జంట!

Viral News: ఐఫోన్ కోసం.. ఇన్ స్టాలో క్యూఆర్ కోడ్ పెట్టి మరి అడుక్కుంటున్న అమ్మాయి?

Dry fruit Samosa: ఓర్నీ దుంపతెగ.. ఏంటీ ఇలాంటి సమోసా ఒకటి ఉందా? రుచి చూస్తే అస్సలు వదలరండోయ్!

Google 27th Anniversary: గూగుల్ 27వ వార్షికోత్సవం.. తొలినాటి డూడుల్ తో సెర్చ్ ఇంజిన్ సర్ ప్రైజ్

Viral Video: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త.. ఇదిగో వీడియో!

Viral News: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..

Viral Video: వరదలో పాము.. చేపను పట్టుకొని జంప్.. వీడియో చూసారా?

Big Stories

×