Big Stories

Viral Video : పిచ్చి పీక్స్.. అమ్మాయి చేసిన రీల్స్‌కు అంతా షాక్!

Teen Girl reel At Airport
Teen Girl reel At Airport

Viral Video : సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యువత రీల్స్‌తో పిచ్చెక్కిస్తున్నారు. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా వారి టాలెంట్‌లను సోషల్ మీడియాలో ఉంచడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం మనోళ్లు చేసే విన్యాసాలు చూస్తే.. కడుపు పగిలేలా నవ్వకుండా ఉండలేము. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఎక్కువగా కాస్త డిఫరెంట్‌గా రీల్స్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో తరచూ ఏదొక వివాదంలో నిలుస్తున్నారు. ఇటువంటి ఘటనలు అనేకం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. మెట్రో స్టేషన్‌లో డాన్సులు వేయడం, రద్దీగా ఉన్న బస్సులో కండక్టర్‌తో గొడవపడటం, హోలీ ఆడుతూ రోమాన్స్ చేయడం వంటి రీల్స్ చేస్తున్నారు. వీరు బట్టలు కూడా చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి.

- Advertisement -

Also Read : ఇదేందయ్యా.. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపావు.. పైగా సారి ఒకటి

ఇక మెట్రోలో రోమాన్స్ చేయడం, బైక్ ముందు కుర్చోని కిస్సులు పెట్టడం వంటి రీల్స్ సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ట్రెండింగ్‌లో ఉంటాయి. కొందరు దీన్ని రీల్స్ మెనియా అని అంటే.. మరి కొందరు పిచ్చని అంటున్నారు. ఇప్పటికే ఇటువంటి వారిని గుర్తించిన పోలీసులు వారి స్టైల్లో ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతానికి అటువంటి ఘటనే ఒకటి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

ఇక విషయానికి వస్తే.. @desimojito అనే X అకౌంట్ నుంచి వీడియో అప్‌లోడ్ అయింది. ఓ యువతి రద్దీగా ఎయిర్ పోర్ట్‌లో కజల్, షారుఖ్ ఖాన్ నటించి కుచ్ కుచ్ హోటా హై సినిమాలోని పాట.. క్యారంగ్ లాయి మేరే దువా.. అనే పాటకు లగేజ్ కన్వే బెల్ట్‌పై పడుకుని మరి రీల్స్ చేసింది.

కానీ ఎయిర్ పోర్టులో అడుగడుగున కేంద్ర భద్రత దళాలు పహారకాస్తుంటాయి. అధికారులు కూడా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. ఎందరో ప్యాసింజర్‌లు తిరుగుతుంటారు. అంత మందిలో కూడా ఆ యువతి ఏమాత్రం మోహమాట పడకుండా వెళ్లి హాయిగా డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇదేం రీల్స్ పిచ్చిరా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలకు రీల్స్ పిచ్చి ముదిరిందని అంటున్నారు.

Also Read : వీడేంటి ఇలా ఉన్నాడు.. పాముతో లిప్‌లాక్!

మరికొందరు మాత్రం భిన్నంగా స్పందించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ఉందని వ్యాఖ్యా నించారు. దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రీల్స్ చేసిన వారిపై పోలుసులు జరిమానా కూడా విధించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News