BigTV English

Flipkart Fake Delivery: ఇదేందయ్యా.. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపావు.. పైగా సారి ఒకటి

Flipkart Fake Delivery: ఇదేందయ్యా.. సెల్ ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు పంపావు.. పైగా సారి ఒకటి
 Flipcart Fake Delivery
Flipcart Fake Delivery

Flipkart Fake Delivery: ఫోన్ ఉంటే చాలు చిటికెలో ఏ వస్తువు అయినా ఆర్టర్ చేస్తే క్షణాల్లో కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. వస్తువులే కాదు గుండు పిన్ను నుంచి మొదలుకుని పెద్దపెద్ద వాహనాల వరకు కూడా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసుకునే టెక్నాలజీ ప్రస్తుతం ఉంది. ఈ తరుణంలో కొన్ని సార్లు ఆన్ లైన్ సంస్థలు(ఈ కామర్స్ వెబ్ సైట్స్) ప్రజలను బోల్తా కొట్టిస్తున్నాయి. కస్టమర్ ఆర్డర్ చేసింది ఒకటైతే డెలివరీలో మరొకటి వస్తుంది. కొన్ని సార్లు ఏ వస్తువు ఆర్డర్ చేసినా రాళ్లను పెట్టి పంపిస్తున్నారు. తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.


కస్టమర్ ఫ్లిప్ కార్ట్‌లో తనకు నచ్చిన ఫోన్ ఆర్డర్ చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో మంచి ఫోన్ కోసం వెతికాడు. ఇలా వెతుకుతుండగా రూ. 22,000 ఖరీదైన ఓ స్మార్ట్ ఫోన్ ను చూశాడు. వెంటనే దానిని కొనాలని డిసైడ్ అయ్యాడు. దీంతో ఫోన్ ఆర్డర్ చేశాడు. ఇక డెలివరీ సమయం వచ్చింది. డెలివరీ బాయ్ వచ్చి ఫోన్ ను డెలివరీ చేసి వెళ్లిపోయాడు. అనంతరం ఆ ఫోన్ బాక్స్‌ను తీసుకున్న వినియోగదారుడు.. ఓపెన్ చూసి చూడగా అవాక్కయ్యాడు. ఫోన్ కు బదులు అందులో రాళ్లు కనింపించాయి. దీంతో వెంటనే దానిని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసి వివరాలు వెల్లడించాడు.

Also Read: రెండో పెళ్లి చేసుకున్న బర్రెలక్క.. నెట్టింట ఫోటోలు, వీడియోలు వైరల్


ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. అంతేకాదు దీనిని ఫ్లిప్ కార్ట్ సంస్థకు ట్యాగ్ చేస్తూ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. ఈ ఘటన ఘాజియాబాద్‌లో జరిగింది. అయితే అందులో రాళ్లు ఉండడం చూసిన తర్వాత డెలివరీ బాయ్ కు తిరిగి ఇస్తే తీసుకోలేదని కూడా తెలిపాడు. తన ఆర్డర్‌కు సంబంధించిన ఫోన్ స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేశాడు. Infinix zero 30 5G ఫోన్ ఆర్టర్ చేసినట్లు తెలిపాడు.

కస్టమర్ కు జరిగిన చేదు అనుభవంపై ఫ్లిప్ కార్ట్ స్పందించింది. కస్టమర్ కు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆర్టర్ కు సంబంధించిన వివరాలను పర్సనల్ చాట్ లో తెలపాలని కోరింది. మరోవైపు ఫ్లిప్ కార్ట్ పేరుతో వచ్చే ఏ ప్రకటనలకు గాను స్పందించవద్దని హెచ్చరించింది. అయితే కేవలం సారీ చెప్పి మాత్రమే ఫ్లిప్ కార్ట్ చేతులు దులుపుకుందని.. తనకు జరిగిన అనుభవాన్ని వివరిస్తూ మరో నెటిజన్ ఈ ట్వీట్ కు కామెంట్ చేశాడు.

Related News

Ganesh Utsav Viral Video: గణపయ్య నిమజ్జనం.. వెక్కివెక్కి ఏడ్చిన చిన్నారి.. వీడియో చూస్తే కన్నీళ్లు గ్యారంటీ!

Viral News: ఒక బీహెచ్‌కే ఫ్లాట్‌కి లక్ష ఇరవై వేలా… షాక్ లో నెటిజన్లు.. ఎక్కడో తెలుసా?

Viral Video: కదులుతున్న రైలుకు వేలాడేతూ డేంజర్ స్టంట్, పైగా అమ్మాయిని టచ్ చేస్తూ..

Hundi Chori: గుడిలో చోరీ.. ఆ తర్వాతి రోజే దొంగ ఇంట్లో ఊహించని ఘటన, దెబ్బకు డబ్బులు తిరిగిచ్చేశాడు!

Viral Video: భార్య కోరిక తీర్చనందుకు భర్తను కుమ్మేసింది.. చివరకు ఏం జరిగింది? వైరల్ వీడియో

Bird wedding festival: ఇక్కడ యువకులకు పెళ్లి నిల్.. పక్షులకు మాత్రం గ్యారెంటీ.. ఈ వెరైటీ కల్చర్ ఎందుకంటే?

Big Stories

×