BigTV English

Vikrant Massey: తన కుమారుడి పేరును టాటూగా వేయించుకున్న స్టార్ హీరో

Vikrant Massey: తన కుమారుడి పేరును టాటూగా వేయించుకున్న స్టార్ హీరో
Vikrant Massey
Vikrant Massey

Vikrant Massey: ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే గతంలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో నటించిన అందరినీ మెప్పించాడు. ఇటీవల ‘12th ఫెయిల్’ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో తన నటనకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


ఐపీఎస్ అధికారి మనోజ్ శర్మ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో వింక్రాంత్ మనోజ్ పాత్రలో నటించి అదరగొట్టేశాడు. ఈ సినిమాకి గానూ విక్రాంత్‌కు తొలి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి క్రిటిక్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది.

అంతేకాకుండా థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవీ ఓటీటీలో వచ్చి అక్కడ కూడా దుమ్ము దులిపేసింది. ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆడియన్స్‌ సినిమా చూసి ఎంతగానో ఇన్‌స్పైర్ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ నటుడికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read:  జై హనుమాన్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ..

గత నెలలో విక్రాంత్ మాస్సే – తన భార్య శీతల్‌ దంపతులు ఫిబ్రవరి 7న తమ మొదటి బిడ్డను స్వాగతించారు. ఈ జంట తమ కుమారుడికి ‘వర్దన్’ అని పేరు పెట్టారు. ఈ లవ్ కపుల్ తమ కొడుకు పుట్టిన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే విక్రాంత్ మాస్సే ఇప్పుడు తన కొడుకు పేరును తన చేతిపై టాటూగా వేయించుకున్నాడు.

Latest and Breaking News on NDTV

అంతేకాకుండా ‘వర్దన్’ అనే పేరుతో పాటు పుట్టిన తేదీని కూడా తన చేతిపై వేయించుకున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలను విక్రాంత్ మాస్సే తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీంతో ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇకపోతే విక్రాంత్, శీతల్ నవంబర్ 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు.

ఫిబ్రవరి 18, 2022న వారిద్దరూ హిమాచల్ ప్రదేశ్‌లో సింపుల్‌గా వివాహం చేసుకున్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు ఒకరితో ఒకరు డేటింగ్ చేసిన తర్వాత ఈ జంట వివాహం చేసుకున్నారు. ఈ జంట మీడియాలో తమ బంధం గురించి ఎప్పుడూ ఓపెన్‌గా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తమ బంధాన్ని పంచుకోవడానికి ఎప్పుడూ దూరంగా ఉండరు.

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×