BigTV English

Anand Mahindra : ఆనంద్‌ మహీంద్రా వీడియో షేర్‌, గ్రేట్ వర్క్ అంటూ కితాబ్

Anand Mahindra : ఆనంద్‌ మహీంద్రా వీడియో షేర్‌, గ్రేట్ వర్క్ అంటూ కితాబ్

Anand Mahindra, who shared the video, said great work


Anand Mahindra, who shared the video, said great work: కష్టపడ్డవారికే ఆ కష్టం విలువ తెలుస్తుంది. అందుకే కాబోలు అంచలంచెలుగా ఒక్కో మెట్టు ఎక్కిన ఎందరో మహానుభావులు తమ అనుభవాలను పంచుకుంటారు. అందులో ఒకరు ఆనంద్ మహీంద్రా. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీని రన్ చేస్తూ అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు.ఎప్పుడు కొత్త ఆలోచనలతో తన కంపెనీని పరుగులు పెట్టిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే…సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే మహీంద్రా, తనకు నచ్చిన వీడియోలను దేనిని వదలకుండా నిత్యం ఆ వీడియోలను నెటిజన్స్ తో పంచుకుంటుంటారు. అంతేకాదు మీకు నచ్చి, మీరు మెచ్చితే మీరు కూడా ఓ లైక్ కొట్టండి అంటూ ట్యాగ్ చేస్తుంటారు.

ఈ విశ్వంలో ఏ పని కూడా అంత సులభం కాదు.ప్రతి పనికి శారీరక శ్రమతో పాటు ఆలోచన కూడా అవసరం.తరుచూ మనం చేసే పనిలో ఎన్నో ఒడిదొడుకులు, ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా సరే వాటిని వదలకుండా వాటిని ఎదుర్కొంటూ ఒక సవాళుగా ఎదుర్కొంటారు. ఇది మన చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రోత్సహిస్తుంది. కొన్నిసార్లు ఇది కమ్యూనికేషన్ నుండి వస్తుంది. కొన్నిసార్లు మన జీవితంలో కంటే ఒకరి జీవితంలో ఎంత ఎక్కువ సవాళ్లు ఉన్నాయో తెలుసుకునే దాని నుండి ప్రోత్సాహం వస్తుంది.

Read More: త్వరలో భారత్ పాప్ సింగర్ బయోపిక్, డైరెక్ట్ గా ఓటీటీలోకి..

మహీంద్రా ఎక్స్ లో వారికి స్పూర్తినిచ్చే వీడియోని షేర్ చేశారు. వీడియోని షేర్ చేస్తున్నప్పుడు నిర్మాణ కార్మికుడు సోమవారం ఇలా ఉంటుంది అనే విషయం క్యాప్షన్ ఇచ్చాడు. నా పని చాలా సులువుగా అనిపించినప్పుడు నేను దీనిని చూస్తాను. అంటూ ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో స్పూర్తిని నింపడమే కాకుండా భవన నిర్మాణ కార్మికుల శ్రమ పట్ల గౌరవాన్ని కూడా పెంచుతుంది.భవన నిర్మాణ కార్మికుడి జీవితంలో ఒక రోజు ఎంతటి ప్రమాదకరం, కష్టంతో కూడుకున్నదో ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది మామూలు రోజు కాదు. నిర్మాణ కార్మికులు సామాగ్రిని మోస్తుండటం ఈ వీడియోలో మనకు కళ్లకు కట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇందులో కనిపించే కార్మికులు ఎత్తైన ప్రదేశాలలో, భూమి నుండి అనేక మైళ్ల ఎత్తులో, ఎత్తైన భవనాలపై పని చేస్తారు.

Read More: రూ.48 వేలను స్వాహా చేసిన 4 డజన్ల కోడిగుడ్లు.. ఎలాగంటే..

భవనంపై నుండి నగరం మొత్తం వీడియోలో కనిపిస్తుంది. దూరం నుండి చూసే వారికి ఇది సింపుల్ అనిపించొచ్చు. కానీ.. అక్కడికి పోయి చూస్తేనే దాని అసలు కథ తెలుస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఓ కార్మికుడు తన ప్రాణాలను పణంగా పెట్టి తన పనిపై ఎంతటి శ్రధ్దని కలిగి ఉన్నాడో స్పష్టంగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గంటల వ్యవధిలోనే నెట్టింట వైరల్ అయింది. ఇంకేముంది సోషల్ మీడియాలో ఆక్టీవ్ గా ఉండే మన ఆనంద్ మహీంద్రా కంటపడింది. మహీంద్రా వెంటనే ఆ వీడియోని ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బాగుంటే ఏదైనా చూస్తానంటూ ఈ వీడియోకి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ తన ఖాతాలో ఇంట్రెస్టింగ్ విషయాలను రాసుకొచ్చారు.

Related News

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×