BigTV English

Director Krish in Drug Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసులు క్లారిటీ!

Director Krish in Drug Case: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్.. పోలీసులు క్లారిటీ!

director krish in drugs case


Tollywood Director Krish Name in Hyderabad Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో సంచలనం. ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్‌కు అనుకోని షాక్ తగిలింది. ఆయన డ్రగ్స్ పార్టీలో ఉన్నట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు FIR కూడా నమోదు చేశారు.

అందులో 8వ నిందితుడిగా చేర్చారు. అంతేకాకుండా దర్శకుడి స్టేట్‌మెంట్ కూడా తీసుకున్నారు. అయితే ఈ విషయంపై మాట్లాడిన దర్శకుడు క్రిష్.. తమ స్నేహితులు పార్టీకి పిలవడం వల్లనే వెళ్లానని అన్నాడు. ఇక ఆ సమయంలో డ్రైవర్ రావడంతో అక్కడి నుంచి వెళ్లిపోయానని తెలిపాడు. కాగా ఈ పార్టీని బీజేపీ నేత తనయుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ పార్టీ ఇచ్చాడు.


గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ డ్రగ్స్ పార్టీలో మొత్తం 10 మంది ఉండగా.. అందులో ముగ్గురు మాత్రమే దొరికారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో పట్టుబడ్డ బీజేపీ నేత కుమారుడు వివేకానంద.. తమ ఫ్రెండ్స్‌తో డ్రగ్స్ పార్టీ చేసుకున్నానంటూ పోలీసుల ఎదుట అంగీకరించాడు.

అంతేకాక ఈ పార్టీలో రఘు చరణ్, నిర్భయ్, కేదార్, సందీప్, శ్వేత, నీల్, క్రిష్‌, లిశిలతో కలిసి తాను పార్టీ చేసుకున్నట్లు తెలిపాడు. దీంతో ఈ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. అంతేకాకుండా ఈ డ్రగ్స్‌ను సయ్యద్ అబ్బాస్ జఫ్రీ దగ్గర కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం హోటల్ సీసీ కెమెరా ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Ester Valerie Noronha : రెండో పెళ్లి చేసుకుంటున్న నోయల్ మాజీ భార్య ఎస్తేర్.. ఇతడితో ఎన్ని రోజులుంటుందో..?

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Big Stories

×