E-Paper
Advertisement

Bike stunt Video: రీల్స్ పిచ్చితో మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్స్..

Bike stunt Video: రీల్స్ పిచ్చితో మొసళ్లు ఉన్న సరస్సులో బైక్ స్టంట్స్..
Advertisement

Bike stunt Video: సోషల్ మీడియాకు చిన్న వారి నుంచి పెద్ద వారి వరకు బానిసలు అవుతున్నారు. తరచూ రీల్స్, వీడియోలు అంటూ ఏ పని పడితే ఆ పని చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు ప్రాణాలను కూడా లెక్కచేయడం లేదు. ఈ తరుణంలో ప్రమాదకర స్థలాలను ఎంచుకుని మరి విన్యాసాలు చేస్తున్నారు. ఇలా ప్రమాదకర విన్యాసాలు చేసి ఇప్పటికే చాలా మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. ఇలా రైలు, బైక్స్, కార్లు వంటి వాటిపై విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి వీడియోలు తరచూ ఎన్ని వెలుగుచూస్తున్నా కూడా యువత మాత్రం మారడం లేదు. అయితే తాజాగా కొంత మంది యువకులు ప్రాణాలకు తెగించి వీడియోలు తీసేందుకు ప్రయత్నించారు.

కేవలం సరదా కోసం వీడియోలు చేస్తూ ప్రాణాలు పోతాయని కూడా ఆలోచించడానికి చేస్తున్న విన్యాసాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా కొంతమంది యువకులు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏకంగా మొసళ్లు ఉన్న చెరువులోకి దిగి మరి విన్యాసాలు చేశారు. సరస్సులో బైకులు, కారులు నడుపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన విన్యాసాలను వీడియోలుగా చిత్రీకరించి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు దాదాపు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో వెలుగుచూసింది. సిలిసెహర్ అనే మొసళ్లు ఉండే సరస్సులో కొంత మంది యువకులు విన్యాసాలు చేశారు. ఏకంగా 300 మొసళ్లకు పైగా ఉండే ఈ సరస్సులో ఓ వ్యక్తి బైక్ నడుపుతూ సాహసం చేశాడు. మరికొంత మంది జీపులతో సరస్సులోకి వెళ్లారు. ఇలా చేసిన వీడియోలను నెట్టిం పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెండు రోజుల్లో దాదాపు 20 మంది యువకులను అరెస్టు చేశారు. నిందితులు అందరు 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు గల వారని తెలిపారు. ఎస్ యూవీ కారు, బైకులతో హంగామా సృష్టించారని, ఇక ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటనలు వెలుగుచూడకుండా సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×