E-Paper
Advertisement

Thailand Trip: భార్యకు బిజినెస్ ట్రిప్ అని చెప్పి థాయ్‌లాండ్ చెక్కేసిన భర్త.. పాపం, వరదల్లో అల్లాడిపోతూ.. లవర్‌తో దొరికిపోయాడు

Thailand Trip: భార్యకు బిజినెస్ ట్రిప్ అని చెప్పి థాయ్‌లాండ్ చెక్కేసిన భర్త.. పాపం, వరదల్లో అల్లాడిపోతూ.. లవర్‌తో దొరికిపోయాడు
Advertisement

Thailand Man With Lover: బ్యాంకాక్‌కు బిజినెస్ ట్రిప్ మీద వెళ్లిన తన భర్త అక్కడ అల్లాడిపోతున్నాడమ్మ అంటూ అప్పట్లో గాయని సమీరా భరద్వాజ్ చేసిన రీల్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే మలేషియాలో చోటుచేసుకుంది. బిజినెస్ ట్రిప్ మీద థాయ్‌లాండ్ వెళ్లిన భర్త.. అక్కడ వరద వల్ల ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయాడు. ఇదిగో ఇలా..

ఆ జంటకు ముగ్గురు పిల్లలు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. భర్తపై భార్యకు ఎటువంటి అనుమానాలు లేవు. ఇటీవల భర్త థాయిలాండ్ వెళ్లాడు. భార్యతో తరచూ మాట్లాడుతుండేవాడు. ఇంతలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఓ మహిళతో భర్తను చూసి భార్య షాక్ కు గురైంది.

Advertisement

దక్షిణ థాయిలాండ్‌లో భారీ వరదల కారణంగా 80 మందికి పైగా మరణించారు. ఈ ప్రాంతంలో అతిపెద్ద నగరమైన హాట్ యాయ్‌తో సహా 12 ప్రావిన్సులలో దాదాపు మూడు మిలియన్ల మంది ప్రజలు వరదల వల్ల ప్రభావితమయ్యారు. మలేషియాకు చెందిన ఓ వ్యక్తి బిజినెస్ పని మీద థాయిలాండ్ కు వెళ్లానని భార్యకు చెప్పాడు. కానీ థాయిలాండ్ లో తన లవర్ తో వరదల్లో చిక్కుకుపోయాడు. నవంబర్ 24న సోషల్ మీడియాలో ఓ మలేషియా మహిళ వరదలతో చిక్కుకుందని రెస్క్యూ అప్‌డేట్‌లను పోస్ట్ చేస్తూ ఓ వీడియో పోస్టు చేశారు.

హోటల్ లో లవర్ తో

భర్త ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్న భార్య, సోషల్ మీడియోలో వీడియోలు తనిఖీ చేసింది. తన భర్తను కనుగొనడానికి సోషల్ మీడియాలో కొందరి సహాయం కోరింది. అతను తన సహోద్యోగులతో కలిసి హాట్ యాయ్‌లో చిక్కుకున్నాడని తెలిపింది. గర్భవతి అయిన తాను, ముగ్గురు పిల్లలు.. ఆయన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ఇంతలో వరద పరిస్థితులపై ఓ వ్యక్తి థాయిలాండ్ లోని హోటల్‌ లో పరిస్థితులపై వీడియో పోస్టు చేశాడు. అతడు హాట్ యాయ్‌లోని తన సహోద్యోగులతో హోటల్ ఉన్నానని చెప్పాడు. అయితే ఆ వీడియోలో ఆమె భర్త వేరే అమ్మాయితో ఉండటం చూసి భార్య షాకైంది.

వీడియో వైరల్

Advertisement

ఈ వీడియో వైరల్ కావడంతో మలేషియాలో భార్య, థాయిలాండ్ లో ప్రియురాలు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పాపం, ప్రియురాలితో కలిసి వరదల్లో అల్లాడిపోతున్నాడమ్మా అంటూ జోకులేస్తున్నారు.

Also Read: Gender Imbalance: అక్కడ పెళ్లికాని మగాళ్లకు ఫుల్ డిమాండ్.. గంటలు లెక్కన భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్న స్త్రీలు!

మలేషియా వార్తా సంస్థ గెంపాక్ ప్రకారం.. 45 ఏళ్ల వ్యక్తి కౌలాలంపూర్‌లో ఒక ముఖ్యమైన సమావేశానికి హాజరవుతున్నానని చెప్పుకుంటూ తన భార్యను తప్పుదారి పట్టించాడు. కానీ లవర్ తో థాయిలాండ్ వరదల్లో చిక్కుకున్నాడు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×