E-Paper
Advertisement

నా యవ్వనం తిరిగొచ్చింది.. మూడేళ్ల తర్వాత, చైనా బ్యూటీ సంచలనం

నా యవ్వనం తిరిగొచ్చింది.. మూడేళ్ల తర్వాత, చైనా బ్యూటీ సంచలనం
Advertisement

Viral News: సోషల్ మీడియా అంటే ఎక్కువగా యువతీ యువకులు గుర్తుకు వస్తుంటారు. ఫాలోవర్స్‌కు పెంచుకునేందుకు వాళ్లు చేస్తున్న ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సందర్భాలు లేకపోలేదు. కొందరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా కోట్లలో ఫాలోవర్స్‌ని కూడగట్టుకుంటారు. అలాంటి వారిలో చైనా బ్యూటీ జియాంగ్ చెంగ్లాన్ ఒకరు. దాదాపు మూడేళ్ల తర్వాత సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చింది. కేవలం 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్‌ని సంపాదించుకుని రికార్డు క్రియేట్ చేసింది.

చైనా బ్యూటీ సంచలనం.. మూడేళ్ల తర్వాత ఎంట్రీ 

Advertisement

చైనా బ్యూటీ జియాంగ్ చెంగ్లాన్ మూడేళ్ల తర్వాత సోషల్‌మీడియాలో అడుగుపెట్టింది. 24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్‌ ఆమె ఫాలో అయ్యారు. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చాక యువతీయువకులు ఫాలోవర్స్‌ని పెంచుకునే ప్రయత్నంలో పడ్డారు. దానివల్ల నెలకుకోట్లలో సంపాదించవచ్చన్నది వారి ఆలోచన. అంతేకాదు సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫాలోవర్లను పెంచుకోవడం అంత తేలికైన విషయం కాదు.

చైనా బ్యూటీ జియాంగ్ చెంగ్లాన్.. మేకప్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కు డౌయిన్ అనే వీడియో షేరింగ్ యాప్‌లో సుమారు 3 కోట్ల మంది ఆమెని ఫాలోయింగ్ చేస్తూ ఉండేవారు. సరిగ్గా మూడేళ్ల నుంచి ఆమె కనిపించడం మానేశారు. ఆ యువతి ఏమైందో ఎవరికీ తెలియదు. ఆమె కోసం చాలామంది వెతికారు, ఎక్కడా జాడ తెలియలేదు. షాంఘై జిన్ జియా కంపెనీతో తలెత్తిన వివాదాల కారణంగా ఆ యువతి సోషల్ మీడియాకు దూరమైంది. ఆమె ఆన్‌లైన్ పేరు చెంగ్షియాన్‌ను ఆ ఏజెన్సీ ట్రేడ్‌మార్క్‌ గా నమోదు చేసుకుంది. దీంతో ఆమె ఆ పేరు ఉపయోగించలేని పరిస్థితి ఏర్పడింది. మే 13న అసలు పేరుతో కొత్త అకౌంట్ ఓపెన్ చేసింది.

Advertisement

24 గంటల్లో కోటి మంది ఫాలోవర్స్.. నా యవ్వనం తిరిగొచ్చింది

ఉన్నట్లుండి ఆమెని ఒక్కసారిగా చూడడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఒక్క రోజులో కోటి మంది ఫాలోవర్స్ సంపాదించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పాత అకౌంట్‌తో అనుబంధంగా ఉన్న షాపులతో ఇప్పుడు ఎలాంటి సంబంధం లేదని తేల్చేసింది. దయచేసి తనపై నమ్మకంతో అక్కడి నుంచి ఏమీ కొనుగోలు చేయవద్దని ఫాలోవర్స్‌ని కోరింది. మూడేళ్లయినా ఫాలోవర్లు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు తెలిపింది. చైనా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 24 గంటల్లో కోటి మందికి పైగా ఫాలోవర్లను సంపాదించుకుని రికార్డు క్రియేట్ చేసింది. 2024లో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఈ ఫీట్ చేశాడు. యూట్యూబ్‌ ద్వారా అతడు నెలకొల్పిన రికార్డును గుర్తు చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.

ఫాలోవర్స్.. దయచేసి తనను నమ్మి ఆ షాపుల నుండి ఆర్డర్లు ఇవ్వకూడదని విజ్ఞప్తి చేసింది. భవిష్యత్తులో తాను బ్యూటీ మేకప్ కోర్సులతో పాటు జీవితం గురించి తన ఆలోచనలను పంచుకోవాలని యోచిస్తున్నట్లు జియాంగ్ తెలిపింది. మే 14న జియాంగ్ విడుదల చేసిన వీడియో రోజువారీ జీవితంలో మేకప్ ఎలా చేసుకోవాలో తెలిపే ప్రక్రియ. ఆ క్లిప్‌లు ముఖంలోని ప్రతి భాగానికి సంబంధించిన కీలకమైన దశల సమాహారంగా వర్ణించారు. ఇంతకుముందు మేకప్ వేసుకున్నా, వేసుకోలేకపోయినా దీని ద్వారా అమ్మాయిలందరూ కొంత ప్రయోజనం పొందుతారని నమ్ముతున్నట్లు చెప్పుకొచ్చింది.

ALSO READ: గుండె గట్టిగా ఉన్నవాళ్లే చూడండి: న్యూయార్క్ వరదల్లో లైవ్ వీడియో

తన సొంత ముఖాన్ని ఉపయోగించి మేకప్ సూచనలు ఇస్తూ ప్రశాంతంగా సున్నితమైన స్వరంతో మాట్లాడతారు ఆ యువతి. 1990వ దశకంలో తర్వాత జన్మించిన మహిళలు ఆమెను అధికంగా ఇష్టపడేవారిలో ఉన్నారు. జియాంగ్ అధిక ధర-వివిధ ఉత్పత్తులను ప్రోత్సహించింది. నాణ్యత లేని వస్తువులకు సంబంధించిన ఏ పెద్ద కుంభకోణాలలో చిక్కుకోలేదు. దీని ద్వారా ఫాలోవర్స్ నుంచి అపారమైన నమ్మకాన్ని పొందారు. నా యవ్వనం తిరిగి వచ్చింది.. బేస్ మేకప్ ఎలా వేసుకోవాలో చాలా సంవత్సరాల కిందట నేర్పిన చిట్కాను ఇప్పటికీ పాటిస్తున్నానని నెట్ యూజర్ అన్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×