BigTV English

French President: దేశాధ్యక్షుడికే తప్పని పెళ్లాం పోరు.. భార్య చేతిలో దెబ్బలు తిన్న అగ్రరాజ్య అధినేత.. వీడియో చూశారా?

French President: దేశాధ్యక్షుడికే తప్పని పెళ్లాం పోరు.. భార్య చేతిలో దెబ్బలు తిన్న అగ్రరాజ్య అధినేత.. వీడియో చూశారా?

French President: నేటి రోజుల్లో భార్యల చేతిలో భర్తలు దెబ్బలు తినడం సహజమే. దెబ్బ అంటే, అందులో సరదాగా ఉండవచ్చు. లేక ఇతర కారణాలు ఉండవచ్చు. దాంపత్య జీవితం అన్నాక ఇవన్నీ మామూలే. కానీ ఇక్కడ ఓ దేశాధ్యక్షుడికి కూడా భార్య చేతిలో దెబ్బలు తప్పలేదు. ఎవరా దేశాధ్యక్షుడు? అసలేంటి కథ తెలుసుకుందాం.


సోషల్ మీడియా ఊహాగానాలకు కొదవలేదు. రాజకీయ నాయకుల కదలికలు, వ్యక్తిగత సంఘటనలు బహిరంగ వేదికలపై కనిపించిన క్షణమే పెద్ద చర్చకు దారితీయడం కొత్తేమీ కాదు. తాజాగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగిట్టే మాక్రాన్ విమానం దిగే సమయంలో తీసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

మొదట ఈ వీడియోను చూసిన వారందరికీ ఇది ఒక ఘర్షణ దృశ్యంగా అనిపించింది. బ్రిగిట్, తన భర్త ముఖాన్ని తాకి పక్కకు నెట్టినట్టుగా కనిపించడంతో, ఆయనను ఆమె చెంపదెబ్బ కొట్టినట్టుగా అభిప్రాయాలు వెల్లువెత్తాయి. ఇది నిజంగానే చెంపదెబ్బా? లేక ఇతర కారణమా? అన్న దానిపై స్పష్టత రావడం ప్రారంభమైంది.


ఈ వీడియోలోని దృశ్యాలు అసోసియేటెడ్ ప్రెస్ కెమెరాల్లో బంధించగా, అనేక మీడియా సంస్థలు దీనిపై ఫోకస్ పెట్టాయి. అసలు విషయం ఏమిటంటే.. హనోయ్ నగరంలో విమానం దిగిన తర్వాత, విమానం తలుపు తెరుచుకున్న క్షణంలో బ్రిగిట్టే మాక్రాన్, తన భర్త ముఖంపై రెండు చేతులతో తాకుతూ పక్కకు తిప్పినట్టుగా కనిపించింది. ఆ సమయంలో మాక్రాన్ కొద్దిగా తడబడినట్టుగా కనిపించగా, వెంటనే సాధారణ స్వరూపంలోకి వచ్చి, అక్కడ ఎదురుగా ఉన్న అధికారులు, ప్రతినిధులను పలకరించారు.

ఈ ఘటనను వీడియో ద్వారా గమనించిన నెటిజన్లు అనేక రకాల ఊహాగానాలు చేయడం మొదలుపెట్టారు. కొందరు ఇది వారి మధ్య వాగ్వాదం తాలూకు పరిపాటి అనగా మొదలైన ఘర్షణ అని చెబుతుండగా, మరికొందరు ఇది కేవలం హాస్యంతో కూడిన సాన్నిహిత్య క్షణంగా అభివర్ణించారు.

ఈ వివాదంపై స్పందించిన ఎలీసీ ప్యాలెస్ (ఫ్రాన్స్ అధ్యక్ష నివాసం) అధికార ప్రతినిధి ఒకరు, ఆ దృశ్యం వారు ప్రయాణం మొదలుపెట్టే ముందు చివరిసారిగా నవ్వుతూ రిలాక్స్ అవుతున్న క్షణం మాత్రమే. అది వారి సాన్నిహిత్యానికి సంబంధించిన మౌన సంకేతం అని వ్యాఖ్యానించారు.

అంతేగాక, ఫ్రెంచ్ మీడియా ప్రకారం, అధ్యక్షుడికి దగ్గరగా ఉన్న ఒకరు మాట్లాడుతూ, పారంపర్యంగా ఉండే ప్రొటోకాల్ ముందే ఉంది. ఇది ఎటువంటి ఘర్షణ క్షణం కాదు. వారిద్దరూ ముందుగా ఒక చిన్న అభిప్రాయ భేదాన్ని పంచుకున్నారు. ఆ తర్వాత తాము ఆ విశ్రాంతి క్షణాన్ని కలిసి గడిపారు. ఇది పూర్తిగా హానిలేని, సాధారణ కుటుంబ సంభాషణే అని తెలిపారు.

Also Read: AP Tourist Place: ఏపీలో వర్షాలు.. ఈ ప్లేస్ కు వెళ్లారో.. నీటితో మాట్లాడే ఛాన్స్!

ఇప్పటికే మాక్రాన్ తన వారం రోజుల ఆసియా పర్యటనను ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయన ఇండోనేషియా, సింగపూర్‌లను కూడా సందర్శించనున్నారు. ఈ పర్యటనకు ఆర్థిక లక్ష్యాలు ఉన్నప్పటికీ, మొదటి రోజు తీసిన వీడియో ప్రజల దృష్టిని పూర్తిగా మరోవైపు మళ్లించిందనే చెప్పాలి.

ఈ సంఘటన ద్వారా మరోసారి రుజువైంది ఏమిటంటే.. ప్రజా జీవితాల్లో ఉన్నవారు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఒక చిన్న కదలిక సైతం పెద్దదై వార్తల్లోకి ఎక్కే ప్రమాదం ఉంది. ఇది నిజంగా చెంపదెబ్బ కాదని ఎలీసీ ప్రకటించినప్పటికీ, వీడియోలోని హావభావాల వల్ల సోషల్ మీడియా ఊహాగానాలను అడ్డుకోలేకపోయింది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఇది ఫ్రెంచ్ అధ్యక్షుడు, ఆయన భార్య మధ్య జరిగిన చిన్న వ్యక్తిగత సంభాషణ. ప్రజల దృష్టికి అటుపెట్టినట్టు కనిపించినా, దీని వెనుక పెద్ద కథ లేదని అధికార వర్గాలు తేల్చి చెప్పాయి. అయినా కూడా, ప్రజల ఆసక్తిని రేపిన ఈ దృశ్యం, మరోసారి వీడియో వేరు.. వెనుక కథ వేరే అనే మాటను నిజం చేసింది.

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×