Poonam Kaur: వైఎస్సార్ కడప జిల్లా మైలవరం మండలం ఎ. కంబాలదిన్నె గ్రామంలో మూడేళ్ల చిన్నారిపై ఓ కిరాతకుడు అత్యాచారం చేసి.. దారుణ హత్య చేసిన విషయం తెలిసిందే. చర్చి వెనుక ముళ్లపొదల్లో చిన్నారి మృతదేహం కనిపించింది. చిన్నారి కుటుంబ సభ్యులంతా పెళ్లి హడావుడిలో ఉండగా.. ఆ పసిపాపను ఆడిస్తున్నట్టు నటిస్తూ చర్చి వెనక్కు తీసుకెళ్లి ఆ నీచుడు అత్యాచారం చేసి చంపేశాడు. అయితే దీనిపై నటి పూనమ్ కౌర్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఆ నరరూప రాక్షసుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. నీచుడికి శిక్ష పడేంత వరకు ప్రజలంతా తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగానే రాజకీయ నాయకుల మౌనం తనను బాధించిందని ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అయితే, బాలిక కోసం వెతుకుతున్న కుటుంబ సభ్యులు రహమతుల్లా చొక్కాపై ఉన్న రక్తపు మరకలను గమనించి అతన్ని గట్టిగా ప్రశ్నించారు. దీంతో ఆ కిరాతకుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాగా.. దీంతో అతన్ని పట్టుకుని దేహశుద్ది చేశారు. ఆ తర్వాత చర్చి వెనుక ముళ్లపొదల్లో పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న తలమంచిపట్నం పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధిత కుటుంబసభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు.
నిందితుడు రహమతుల్లాను తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. నిందితుడు తప్పతాగి ఈ దారుణానికి ఒడిగట్టాడని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. టెన్త్ క్లాస్ వరకు చదివిన రహమతుల్లా జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడని పోలీసులు తెలిపారు. అయితే ఘటనపై నటి పూనమ్ కౌర్ రియాక్ట్ అయ్యారు.
ALSO READ: AP Fee Reimbursement: ఏపీలో కీలక సర్వే.. ఇలా చేస్తే మీ డబ్బులు మీకు వాపస్.. అదెలాగంటే?
ఈ దారుణ ఘటనకు పాల్పడిన కిరాతకుడికి శిక్ష పడే అంతవరకు ప్రజలు తమ గళాన్ని వినిపించాలని ఆమె పిలుపునిచ్చారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఘటనను పట్టించుకోకపోవడం, రాజకీయ నాయకుల మౌనం తనను తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఇలాంటి నీచుల నుంచి ఇంకొకరైనా బాధితులుగా మారకూడదంటే.. రాష్ట్ర ప్రజలు నిరసన గళాన్ని వినిపించాలని పూనమ్ పిలుపునిచ్చారు. పొలిటికల్ బెనిఫిట్ ఉంటేనే మీడియా ఇలాంటి ఘటనలను కవర్ చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నారికి న్యాయం జరిగేంతవరకూ పోరాడాలని ఆమె డిమాండ్ చేశారు. పూనమ్ గళం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.