Woman Sprays Pepper: దిల్లీ, కోల్ కతా, ముంబై ఇలా దేశంలోని ప్రధాన నగరాల్లో నిత్యం వేల మంది పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఉద్యోగం, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు చేస్తుంటారు. పీక్ అవర్స్ ఉదయం, సాయంత్రం వేళ రైళ్లు, బస్సులు ప్రయాణికులతో నిండిపోతుంటాయి. ఈ సమయాల్లో సీట్ కోసం ఘర్షణలు తలెత్తుతుంటాయి. అలాంటి ఘటనే కోల్ కతాలో చోటుచేసుకుంది. లోకల్ ట్రైన్ లో సీటు కోసం ఓ మహిళ తోటి ప్రయాణికుల కళ్లలో పెప్పర్ స్ప్రే కొట్టింది.
కోల్‌కతా సీల్దా రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ యూజర్ అమృత సర్కార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఈ వీడియోలో ఆకుపచ్చ డ్రెస్ లో ఉన్న మహిళ ట్రైన్ లో సీటు కోసం తోటి ప్రయాణికుడితో వాగ్వాదానికి దిగింది. అతడు సీటు ఇవ్వకపోవడంతో పెప్పర్ స్ప్రే తీసి అతడి ముఖంపై స్ప్రే చేయడానికి ప్రయత్నించింది. మరొక మహిళ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా.. ఆ మహిళ రైలు కంపార్ట్‌మెంట్ అంతటా పెప్పర్ స్ప్రే చేసింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. దగ్గు, గొంతు, ముక్కు మంటతో బాధపడ్డారు. ఇద్దరు పిల్లలు అస్వస్థతకు గురయ్యారు’అని సర్కార్ తన ఇన్ స్టా పోస్ట్‌లో తెలిపారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఆ మహిళ క్షమాపణలు చెబుతుంది. తోటి ప్రయాణికులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఇతర ప్రయాణికులు ఆ మహిళను అడ్డుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.
In Kolkata, a woman sprayed pepper spray inside a compartment of a local train bound for Sealdah during a heated argument over seats.
Anyway, there is no such thing as fair gender.. We live among some seriously mentally ill people. pic.twitter.com/k120Ixs8yy
— Monojit Sinha (@MonojitSinha11) October 10, 2025
Also Read: Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. సీటు కోసం ఈ తరహా ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయని అంటున్నారు. నిజంగా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే పెప్పర్ స్ప్రేను ఉపయోగించాలని అంటున్నారు.