BigTV English

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

World’s Jumbo Baby Boy:

తరచుగా బరువైన పిల్లలు పుట్టారని వార్తల్లో చూస్తుంటాం. తాజాగా మరో బాల భీముడు జన్మించాడు. అమెరికాలో పుట్టిన ఈ పిల్లాడు ప్రపంచంలోనే అత్యంత బరువైన శిశువుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి బరువు అక్షరాలా 12 పౌండ్ల 14 ఔన్సులు(5.8 కిలోలు)గా డాక్టర్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ శిశువు బరువు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. టేనస్సీ లోని నాష్‌ విల్లేకు చెందిన షెల్బీ మార్టిన్.. ఇటీవల తన తొలిసారి బిడ్డకు జన్మనిచ్చింది. అతడు అసాధారణ బరువుతో జన్మించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అతడికి షెల్బీ.. కాసియన్‌ అనే పేరు పెట్టింది. అతడి జననం ట్రైస్టార్ సెంటెనియల్ ఉమెన్స్ హాస్పిటల్‌ లో కొత్త రికార్డును సృష్టించడమే కాకుండా ఆన్‌ లైన్‌ లో వైరల్ గా మారింది. ఎక్కువ బరువుతో కూడిన బిడ్డను ప్రసవించడం సవాళ్లతో కూడుకున్న వ్యవహారం అయినప్పటికీ, ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.


అసాధారణ పెద్ద బేబీ బంప్‌ తో కనిపించిన షెల్బీ మార్టిన్

షెల్బీ మార్టిన్ తన గర్భధారణకు సంబంధించిన వీడియోలను టిక్‌ టాక్‌ లో పంచుకుంది. ఆమె బేబీ బంప్‌  అసాధారణంగా కనిపించింది. ఆమె వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. చాలా మంది ఆమె పెద్ద బిడ్డను కనబోతుందని ముందుగానే కామెంట్స్ పెట్టారు.  ప్రజలు పెద్ద బిడ్డను కనడం గురించి మాట్లాడినప్పుడు.. “నన్ను నమ్మండి, నాకు పెద్దగా తెలుసు” అంటూ ఫన్ చేసింది.

దాదాపు 13 పౌండ్ల బరువుతో రికార్డులను బద్దలు కొట్టిన కాసియన్

షెల్బీకి పుట్టిన కొడుకు కాసియన్ 12 పౌండ్లు, 14 ఔన్సుల బరువును కలిగి ఉన్నాడు. ఈ బరవు అసాధారణమైనది. అమెరికాలో సగటు నవజాత శిశువు బరువు సుమారు 7 పౌండ్లు అని స్టాన్‌ఫోర్డ్ చిల్డ్రన్స్ హెల్త్ తెలిపింది. కాసియన్ బరువు ట్రైస్టార్ సెంటెనియల్ ఉమెన్స్ హాస్పిటల్‌  చరిత్రలో అత్యంత పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. వైద్యులు, నర్సులు అతడి పరిమాణం పట్ల ఆశ్చర్యపోయారు. అతడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నా,  కొద్ది గంటల పాటు NICUలో  ఉండాల్సి వచ్చింది. అతడికి కొద్ది గంటలు కృత్రిమంగా IV ద్రవాలు, ఆక్సిజన్ సపోర్టు, గ్లూకోజ్ అందించారు. ఇక తన బిడ్డను క్షేమంగా ప్రసవించేలా చేసిన వైద్య బృందానికి షెల్బీ ధన్యవాదాలు చెప్పింది.


అసాధారణంగా బరువు ఉన్న పిల్లల్లో ఎదురయ్యే సవాళ్లు  

అసాధారణంగా అధిక జనన బరువులతో జన్మించిన పిల్లలు  సాధారణంగా మాక్రోసోమిక్ శిశువులు అని పిలుస్తారు. వీళ్లు  ప్రసవ సమయంలో ప్రత్యేకమైన సవాళ్లకు కారణం అవుతారు. 10 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న శిశువులను సురక్షితంగా ప్రసవించడానికి తల్లులకు సి-సెక్షన్లు అవసరం అవుతాయి. జననం తర్వాత శిశువు సజావుగా ఎదగడానికి  గ్లూకోజ్ స్థాయిలు, ఆక్సిజన్ అందించేందుకు NICU పర్యవేక్షణ అవసరం అవుతుంది. జనన సమయంలో 9 పౌండ్ల కంటే ఎక్కువ బరువున్న పిల్లలను సాధారణంగా మాక్రోసోమిక్‌గా వర్గీకరిస్తారు. పిల్లల బరువుకు జెనెటిక్స్, తల్లి ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, తల్లికి మధుమేహం, దీర్ఘకాలిక గర్భధారణ లాంటి అంశాలు కూడా శిశువు అధిక బరువుకు కారణం అవుతాయంటున్నారు వైద్యులు.

Read Also: హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అలా కాకూడదంటే ఏం చేయాలి?

Related News

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Viral News: ఉద్యోగికి పొరపాటున 300 రెట్లు ఎక్కువ జీతం చెల్లించిన కంపెనీ, ఊహించని తీర్పు ఇచ్చిన కోర్టు!

Viral Video: కారుపై ముద్దులాట.. కౌగిలింతలతో బరితెగింపు.. ఈ వీడియో చూస్తే ఏమైపోతారో!

Credit Cards: ఒకే వ్యక్తికి 1638 క్రెడిట్ కార్డులు.. అన్నీ పనిచేసేవే, గిన్నీస్ రికార్డుకు ఎక్కేశాడుగా!

Big Stories

×