BigTV English

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Viral video: రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌పై రిస్క్ చేసిన దంపతులు.. దూసుకొచ్చిన వందే భారత్!

Viral video: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియా హవానే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలు, స్నేక్ వీడియోలు, రీల్స్ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొంత మంది సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. రైల్వే ట్రాక్ లపై పడుకోవడం, ఎత్తైన బిల్డింగులు ఎక్కి వేలాడడం, స్పోర్ట్స్ బైక్ లతో విన్యాసాలు.. ఇలాంటి రీల్స్ చేస్తూ ప్రాణాలను కొని తెచ్చుకుంటున్నారు. పోలీసు అధికారులు హెచ్చరించినా కొందరి తీరు మాత్రం మారడం లేదు. వ్యూస్ కోసమో.. సోషల్ మీడియాలో హైలెట్ అవుదామో అని చేసే వారి ప్రయత్నాలు చివరకు బెడిసి కొడుతున్నాయి. తాజాగా ఇద్దరు కపుల్స్ వందే భారత్ ట్రైన్ వచ్చే సమయంలో రీల్స్ చేసేందుకు సిద్ధమయ్యారు. జస్ట్ మిస్ అయితే ప్రాణాలే పోయేవి.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


భోజ్‌పురి సాంగ్‌కు రీల్.. 

ఒక యువ జంట ఫెప్డా ఖతమ్ గే అని భోజ్‌పురి సాంగ్ కు రైల్వే ట్రాక్ పక్కనే నిలబి డాన్స్ చేస్తూ రీల్స్ చేశారు. ఈ వీడియో కాస్త చూడడానికి సరదగా ఉన్న.. ఏమాత్రం మిస్టేక్ అయినా ప్రాణాలే పోయి ఉండేవి. వారు వెనుక నుంచి వందే భారత్ రైలు వేగంగా దూసుకొస్తున్నప్పటికీ ఆ జంట దానిని ఏమాత్రం పట్టించుకోకుండా.. రీల్స్ బిజీ లో పడిపోయినట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత వేగంగా వెళ్తున్న వందే భారత్ రైలు పక్కన రీల్స్ చేయడం ప్రాణాలతో చెలగాటం ఆడడమే..


సోషల్ మీడియాలో ఫేమ్ కోసం..?

ఈ వీడీయోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కొన్ని సెకన్ల పాటు సోషల్ మీడియా ఫేమ్ కోసం.. యువత తమ జీవితాలను పణంగా పెడుతున్నారు అనే శీర్షికతో ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇలాంటి వీడియోలు చూడడానికి సరదాగా ఉన్నప్పటికీ కొంచెం అయితే ప్రాణాలే పోయేవి.. రైల్వే బ్రిడ్జిలపై వేగంగా వెళ్తున్న రైళ్ల వెనుక రీల్స్ చేస్తున్నారు.. చిన్న మిస్టే క్ అయినా.. గాలి వేగం పెరిగినా.. ప్రాణాలు పోయినట్టే అని రాసుకొచ్చారు.

ALSO READ: ECIL Notification: ఈసీఐఎల్ హైదరాబాద్‌లో జాబ్స్.. ఇంటర్వ్యూతోనే ఉద్యోగం.. నెలకు రూ.55వేల జీతం

రూ.5లక్షల ఫైన్ వేయాలి..

ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి రీల్స్ చేయడం.. ఏమాత్రం సరికాదని కామెంట్ చేశారు. రైల్వే లైన్‌లు లేదా ప్రమాదకర ప్రాంతాల్లో రీల్స్ చేసే వారికి ప్రభుత్వం కనీసం రూ.5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించాలని నెటిజన్లు ఫైరవుతున్నారు.  ఇలాంటి పిచ్చి రీల్స్ వల్లే రైల్వే సిబ్బందికి అనవసరమైన భారం, రైలు ట్రాక్‌లకు నష్టం, వైద్య, చట్టపరమైన ఖర్చులు వంటివి పెరుగుతాయని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు.

ALSO READ: UPSC: యూపీఎస్సీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఈ జాబ్‌కు ఎంపికైతే భారీ వేతనం, దరఖాస్తు జస్ట్ ఇంకా..?

ఆర్‌పీఎఫ్ స్పందన..

ఈ జంట రీల్స్ చేసిన లోకేషన్ ఎక్కడో తెలియదు. అయితే ఓ నెటిజన్ రైల్వే అధికారులను ట్యాగ్ చేశారు. దీనిపై ఖరగ్‌పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) స్పందించింది. ఆ ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకున్నట్లు ప్రకటించింది. రైల్వే ట్రాక్‌లపై ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం రైల్వే చట్టాల ప్రకారం నేరం, దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Related News

Dinosaur Condom: డైనోసార్ కండోమ్.. రాయిని బద్దలకొడితే ఇది బయటపడింది, సైజ్ ఏంటీ సామి అంత ఉంది?

Woman Sprays Pepper: ప్రయాణికుల కళ్లల్లో పెప్పర్ స్ప్రే కొట్టిన మహిళ.. అలా ఎందుకు చేసిందంటే?

Viral News: బాల భీముడు మళ్లీ పుట్టాడు, బరువు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Software Engineer Journey: సెక్యూరిటీ గార్డ్ To సాఫ్ట్‌ వేర్ ఇంజనీర్.. ఆకట్టుకునే జోహో ఎంప్లాయీ సక్సెస్ స్టోరీ!

Viral News: ఎంతకొట్టినా చావడం లేదని.. నోటితో కొరికి పాముని చంపేశాడు, వింత ఘటన ఎక్కడ?

Nose Drinks Beer: ఓరి మీ దుంపలు తెగ.. ముక్కుతో బీరు తాగడం ఏంటి?

Happy Divorce: పాలతో స్నానం చేసి.. కేక్ కట్ చేసి.. విడాకులను సెలబ్రేట్ చేసుకున్న భర్త, వీడియో వైరల్

Big Stories

×