Dil Raju Comments : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో థియేటర్ల కొరత నడుస్తుంది.. సినిమాలను నిర్మిస్తున్న నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు మధ్య గత కొద్ది రోజులుగా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళ మధ్య పర్సంటేజ్ గురించి ఇప్పటికే సార్లు చర్చలు నడిచాయి. కానీ ఇప్పటికీ ఈ సమస్య ఓ కొలిక్కి రాలేదు. తాజాగా నేడు మరోసారి ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ లోని పెద్దలు చర్చలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టగా.. నిర్మాత అల్లు అరవింద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడు సోమవారం.. దిల్ రాజు మీడియా ముందుకొచ్చారు.. ఈ ప్రెస్ మీట్ లో దిల్ రాజు ఎక్కువగా ఏం మాట్లాడారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
ఎవరికి వారే.. సినిమాల పరిస్థితి ఏంటి..?
తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన దిల్ రాజు అనేక అంశాల గురించి చర్చించారు.. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కలిసిమెలిసి ఉండే వాళ్ళు ఎక్కువగా ఉండే వాళ్ళు. కానీ ఈమధ్య ఎవరి దారి వారిదే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారే తప్ప ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదంటూ ఆయన సీరియస్ అయ్యారు.. 250 థియేటర్లు ఓనర్స్, వాళ్లకు సంబంధించిన వాళ్లు మాత్రమే నడుపుతున్నారు. ‘ఆ నలుగురు’ అంటూ మీడియా ఇష్టమొచ్చినట్లు రాస్తోందని, అందుకే ఈ విషయమై క్లారిటీ ఇవ్వాలని ఈ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలో దిల్ రాజు పై డైరెక్ట్ కౌంటర్స్ వేశారు. దాంతో ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఖరీదైన కారును కొన్న హర్ష.. ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్ బ్లాకే..
‘గేమ్ ఛేంజర్’ పైరసీ పై దిల్ రాజు సీరియస్..
భారీ అంచనాల నడుమ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలలో గేమ్ చేంజర్ ఒకటి.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కియారా అద్వానీ జంటగా నటించిన సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు.. గేమ్ ఛేంజర్ విడుదలైన రోజే పైరసీ ప్రింట్ వచ్చింది. కానీ ఓ మాజీ నిర్మాత.. ప్రొడ్యూసరే ఈ సినిమాని కావాలనే పైరసీ చేశాడని అన్నాడు. ఇది ఎంత నీచం? నా సినిమాను ఎలాగైన కాపాడుకుంటాను కానీ పైరసీ చేసుకుంటానా? కొంతమంది చాలా నీచంగా బిహేవ్ చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాని నేను పైరసీ చేసుకుంటానా? పైరసీ చేస్తే ప్రొడ్యూసర్‌గా నాకు నష్టం కాదా? డిస్ట్రిబ్యూటర్‌కు నష్టం కాదా? సొంత సినిమాని ఎవరైనా డిజాస్టర్ అయ్యేలా చేసుకుంటారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు దిల్ రాజు.. మూవీ డిజాస్టర్ అవడం నాకు ఎంత బాధను మిగిల్చిందో అది నాకు మాత్రమే తెలుసు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రస్తుతం దిల్ రాజు ప్రెస్ మీట్ లో కీలక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.. ఇంకా ఎటువంటి విషయాలపై అయినా ప్రస్తావిస్తారో తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనా కూడా దిల్ రాజ్ మాటలు నిజమే అంటూ నెటిజన్లు ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు.