Live Accident Video: రైల్వే ప్రమాదాలకు సంబంధించిన విజువల్స్ తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి హల్ చల్ చేస్తున్నది. ఓ యువతి రైలు పట్టాలు దాటుతుండగా, గూడ్స్ ట్రైన్ ఢీకొట్టింది. సైకిల్ తో పాటు యువతిని కొద్ది మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో అమ్మాయి కళ్లముందే ముక్కలు ముక్కలు అయ్యింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని మాలిపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. అయితే, ఈఘటపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది ప్రమాదం అంటుంటే, మరికొంత మంది ఆత్మహత్య అంటున్నారు.
రైల్వే గేట్ దగ్గర ఆగి మరీ ముందుకొచ్చిన యువతి
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే, రైలు వచ్చే సమయంలో రైల్వే గేటు పడింది. అప్పటికే సైకిల్ మీద అక్కడికి వచ్చిన యువతి గేట్ దగ్గర నిలబడింది. కాసేపటి తర్వాత ఓ వ్యక్తి గేట్ పడి ఉన్నప్పటికీ, సైకిల్ మీద పట్టాలు దాటుతూ వెళ్లిపోయాడు. ఆయన వెళ్లిన కాసేపటికే రైలు వచ్చింది. రైలు వచ్చే సమయంలోనే అమ్మాయి తన సైకిల్ తో పాటు వచ్చి రైల్వే ట్రాక్ మీద నిలబడింది. క్షణాల్లో గూడ్స్ రైలు వచ్చి అమ్మాయిని ఢీకొట్టింది. యువతితో పాటు ఆమె సైకిల్ ను కొద్ది మీటర్ల వరకు రైలు లాక్కెళ్లినట్లు కనిపిస్తున్నది. ఈ ప్రమాదంలో యువతి స్పాట్ లోనే చనిపోయింది. ఈ ఘటన స్ధానికంగా విషాదం నిలిపింది. చూస్తుండగానే అమ్మాయి ప్రాణాలు పోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
యాక్సిడెంట్ కాదు సూసైడ్ అంటున్న నెటిజన్లు
ఈ వీడియోను చూసి పలువురు నెటిజన్లు, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతోనే ట్రాక్ మీదికి వచ్చిందంటున్నారు. రైలు వచ్చే సమయానికి ట్రాక్ మీదికి వచ్చి నిలబడిందంటే.. సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఉందంటున్నారు. అటు ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతురాలు ఎవరు? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.
Very painful incident at Malipur station today
👉 please don't Cross the railway line when gate is closed pic.twitter.com/0rbVAxhdhs— AnuraG YadaV (@techstar_anurag) January 27, 2025
మహారాష్ట్రాలోనూ ఇలాంటి ఘటనే..
తాజాగా మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటన జరగింది. వైష్ణవి రావల్ అనే విద్యార్థి ట్రాక్ దాటుతుండగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయింది. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని రైల్వే ట్రాక్ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. యువతి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారం వ్యవధిలో రెండు ఘటనలు జరగడం అందరినీ కలచివేస్తున్నది.
రైల్వే గేట్లు మూసినప్పుడు పట్టాలు దాటకూడదంటున్న అధికారులు
అటు ఈ ప్రమాదాలపై రైల్వే అధికారులు స్పందించారు. రైల్వే గేట్లు మూసి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టాలు దాటకూడదంటున్నారు. ఐదు నిమిషాలు వెయిట్ చేయడం వల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదంటున్నారు. అనవసరంగా ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తే, ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందన్నారు.
Read Also: దూసుకొస్తున్న రైలు, సడెన్ పట్టాల మీద పడిపోయిన యువతి, సీన్ కట్ చేస్తే…