రైల్వే ప్రయాణాల్లో జరిగే సంఘటనలు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొంత మంది రైలు దగ్గరికి రాగానే దాని కింద పడి చనిపోయిన వీడియోలు చాలా చూశాం. ప్రమాదవశాత్తు రైలు కాలు జారి రైలు కింద పడిపోయే వారిని కాపాడిన వీడియోలు సైతం నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తాజాగా ఓ యువతి తృటిలో ప్రాణాలతో బయట పడిన వీడియో ఒకటి బాగా వైరల్ అవుతున్నది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.
సడెన్ గా పట్టాల మీద పడిపోయిన యువతి
ఓ మెట్రో స్టేషన్ లో చాలా మంది రైలు కోసం వేచి చూస్తున్నారు. అప్పటికే రైల్వే స్టేషన్ లోకి ట్రైన్ వచ్చేసింది. చాలా మంది రైలు ఎక్కేందుకు ముందుకు వచ్చారు. అప్పుడే ఓ వ్యక్తి సడెన్ గా ముందుకు పడిపోయాయి. అతడు రైలు కోసం ఎదురు చూస్తున్న యువతి మీద పడటంతో ఆమె అమాంతం ఎగిరి రైల్వే ట్రాక్ మీద పడిపోయింది. అప్పటికే రైలు దగ్గరికి వచ్చేసింది. కొంత మంది ప్రయాణీకులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినా, రైలు ముందుకు రావడంతో ఎవరూ ట్రాక్ మీదికి దూకే ప్రయత్నం చేయలేదు. అయితే, ప్లాట్ ఫారమ్ మీద ఉన్న వాళ్లంతా రైలు ఆపాలంటూ చేతులలోని బ్యాగులు ఊపుతూ లోకో పైలెట్ ను కోరారు. అతడు పట్టాల మీద పడిపోయిన యువతిని గమనించాడు. ప్రయాణీకుల రిక్వెస్ట్ తో ట్రైన్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసి రైలును ఆపాడు.
It's so good to see humans work together for the greater good 🥹 pic.twitter.com/x76Rq3RG60
— Virality Clips (@ViralityClips) January 25, 2025
Read Also: మహా కుంభమేళాకు వెళ్తున్న రైలుపై దుండగుల దాడి, భయంతో వణికిపోయిన ప్రయాణీకులు!
ట్రాక్ మీదికి దూకి యుతిని కాపాడిన ప్రయాణీకులు
రైలు ఆగడంతో కొందరు ప్రయాణీకులు ట్రాక్ మీదికి దూకుతారు. ఆ అమ్మాయిని పైకి లేపి ఫ్లాట్ ఫారమ్ మీదికి ఎక్కిస్తారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ అమ్మాయి లేచిన టైమ్ బాగుందంని, అందుకే ప్రాణాలతో బయటపడిందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్లాట్ ఫారమ్ మీద ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ఇలాంటి ఘటనలే జరుగుతాయని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. లోకో పైలెట్ మానవత్వానికి హ్యాట్సాఫ్ చెప్పాలని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆయన రైలు ఆపకపోతే యువతి ప్రాణాలతో బయటపడేది కాదంటున్నారు. ఇప్పటికైనా రైల్వే స్టేషన్ లో రైలు వచ్చేటప్పుడు దూరంగా జాగ్రత్తగా నిలబడాలని నెటిజన్లు సూచిస్తున్నారు. లేదంటే ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. ఈ వీడియోలోని లోకో పైలెట్ లా అందరూ ఉండకపోవచ్చు. వేగంలో ప్రాణాలు కోల్పోవచ్చంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఏకంగా 16.9 మిలియన్లకు పైగా వ్యూస్ సాదించింది. 26 వేలకు పైగా లైక్స్ అందుకుంది.
Read Also: దేశంలో అత్యంత పురాతన రైల్వే స్టేషన్లు ఇవే.. భారత్ లో ఫస్ట్ స్టేషన్ ను ఎక్కడ నిర్మించారంటే?