E-Paper
Advertisement

Viral Video: పాము నోట్లో నోరు పెట్టి.. వామ్మో, అలా చేశావేంటి భయ్యా!

Viral Video: పాము నోట్లో నోరు పెట్టి.. వామ్మో, అలా చేశావేంటి భయ్యా!
Advertisement

Viral Video: గుజరాత్‌ రాష్ట్రంలోని వల్సాద్ జిల్లాలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తగిలి, చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పాముకు ప్రాణం పోశాడు ఓ స్నేక్ రెస్క్యూయర్. అది కూడా పాము నోట్లో నోరు పెట్టి మరీ CPR చేసి బతికించాడు. దీనికోసం దాదాపు 30 నిమిషాలపైనే కష్టపడ్డాడా స్నేక్ క్యాచర్. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

15 అడుగుల ఎత్తులో నుంచి..

ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ.. త్రీ ఫేజ్ కరెంట్ తీగలపైకి ఎక్కింది. అక్కడ అనుకోకుండా పాముకు కరెంట్ షాక్ తగలటంతో, దాదాపు 15 అడుగుల ఎత్తులో నుంచి నేలపై పడిపోయింది. దీంతో అది అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఎలాంటి కదలికలు లేకుండా నేలపై అచేతనంగా పడిపోయిన పామును గమనించిన గ్రామస్థులు ముకేష్ వాయద్‌ (స్నేక్ రెస్క్యూయర్)కు సమాచారం ఇచ్చారు. దీంతో.. సంఘటనా స్థలానికి వచ్చిన ముకేష్ పాము పరిస్థితిని ఇట్టే కనిపెట్టేశాడు. పాములను రక్షించడంలో పదేళ్ల అనుభవం ఉన్న ముకేష్.. ఏమీ ఆలోచించకుండా పాముకు CPR చేయటం మొదలెట్టాడు.

ఏకంగా పాము తలనే నోట్లో..

Advertisement

ఈ క్రమంలో పాము తలను నోట్లో పెట్టుకుని దానికి ఊపిరి ఊదాడు. ఆ పామును రక్షించటంలో దాదాపు అర్ధగంట పాటు తీవ్రంగా శ్రమించాడు. చివరకు ముకేష్ ప్రయత్నాలు ఫలించి.. పాములో కదలికలు వచ్చాయి. దీంతో ముకేష్ ఆ పామును ఊరికి దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేశాడు. అయితే.. స్నేక్ రెస్క్యూయర్ నోట్లో పెట్టుకుని సీపీఆర్ చేసిన పాము(జెర్రి పోతు) విషపూరితమైనది కాదట. ఇకపోతే.. స్నేక్ క్యాచర్ ముకేష్ చేసిన ఈ సాహసోపేతమైన చర్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మీరూ ఆ వీడియో చూసేయండి..

?utm_source=ig_web_button_share_sheet

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×