E-Paper
Advertisement

Beautiful women: ఇంటికొచ్చిన అతిథికి భార్యనే కానుకగా ఇచ్చే భర్త, ఆమె జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేయదు

Beautiful women:  ఇంటికొచ్చిన అతిథికి భార్యనే కానుకగా ఇచ్చే భర్త, ఆమె జీవితంలో ఒక్కసారి కూడా స్నానం  చేయదు
Advertisement

స్త్రీలను ఈ ప్రపంచంలో అందానికి ప్రతీకలుగా చెప్పుకుంటారు. ఆమె కోసమే ఎన్నో బ్యూటీ ఉత్పత్తులు కూడా సిద్ధమవుతూ ఉంటాయి. ప్రతిరోజూ స్నానం చేయడం, ముఖాన్ని నాలుగైదు సార్లు ఫేస్ వాష్ తో రుద్దడం, క్రీములు పూయడం ఇవన్నీ అందంగా ఉండాలనుకునే ప్రతి మహిళలు చేస్తూ ఉంటారు. కానీ జీవితంలో ఒక్కసారి కూడా స్నానం చేయని మహిళలు కూడా ఈ భూమిపై ఉన్నారు. అయితే వారు చూడటానికి అంద విహీనంగా ఉంటారేమో అనుకోవచ్చు. వారు అప్సరసల్లాగా అందంగా కనిపిస్తారు. ఆ మహిళలు ఎక్కడ ఉంటారు? వారు ఎందుకు స్నానం చేయరో తెలుసుకోండి.

హింబా తెగ మహిళలు
నమీబియా దేశంలో హింబా తెగ ప్రజలు నివసిస్తున్నారు. మీరు ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉండేందుకు ఇష్టపడతారు. పాత ఆచారాలను, సాంప్రదాయాలను ఇప్పటికీ పాటించేందుకు ముందుంటారు. హింబా తెగలో కూడా ప్రత్యేకమైన సాంప్రదాయాలు ఉన్నాయి. అలాగే మహిళల అందాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని చిట్కాలు కూడా వారు పాటిస్తారు.

Advertisement

హింబా తెగ నమీబియా దేశంలో ఉత్తరాన ఉన్న కునాన్ ప్రావిన్స్ లో నివసిస్తోంది. ఈ ప్రాంతం చాలా పొడిగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నీటి కొరత ఎక్కువ. అయినప్పటికీ అక్కడ మహిళలు ఎంతో అందంగా కనిపిస్తారు. తమ సాంప్రదాయపు కట్టుబాట్లను కొనసాగిస్తారు. వీరి జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. హింబా ప్రజల్లో స్త్రీలు ఎప్పటికీ స్నానం చేయరు. అయినా కూడా వారు మురికిగా కాకుండా అందంగా కనిపిస్తారు. తీవ్రమైన నీటి కొరత కారణంగా వారు స్నానానికి నీటిని వాడరు. అయితే శరీరాన్ని శుభ్రపరచుకోవడానికి ఒక వింతైన చిట్కాను పాటిస్తారు.

ఆ మొక్కతోనే స్నానం
వారు నివసించే ప్రాంతంలో ఓమ్‌జుంబాజంబ్ అనే ప్రత్యేకమైన మొక్క ఉంటుంది. ఆ మొక్క ఆకులను కుప్పగా పోసి కాలుస్తారు. అలా కాలుస్తున్నప్పుడు వచ్చిన పొగని పీల్చుకుంటారు. అలాగే ఆ పొగ తమ శరీరానికి తాకేలా చేస్తారు. అలా చేయడం ద్వారా తమను తాము శుభ్రపరచుకుంటారు. ఇది వారి శరీరం నుంచి ప్రత్యేకమైన సువాసన వచ్చేలా చేస్తుంది.

Advertisement

ఇక ముఖానికి చేతులకు ఓటిజే అనే ఎర్రటి మట్టిని పేస్టులాగా చేసి రాసుకుంటారు.ఆ మట్టిలో జంతువుల కొవ్వును కూడా కలుపుతారు. ఇది చర్మంపై సూర్యకిరణాలు వల్ల కలిగే హానిని అడ్డుకుంటుంది. అలాగే పొడి బారే సమస్యను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఆ ఎర్ర మట్టిలో ఉన్న సుగుణాలు వారి చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి.

స్త్రీల జుట్టు కూడా వారి అందంలో ముఖ్యమైన భాగమే. వారి జుట్టుకు కూడా ఈ పేస్టునే రాస్తారు. ఇలా ఎర్రటి మట్టిని జుట్టుకు రాసుకున్నారంటే వారు పెళ్లయిన స్త్రీలు అని అర్థం. అలాగే వారి జుట్టుకు పూసలు వంటివి పెట్టుకుని చాలా విచిత్రమైన జడలను వేసుకుంటారు.

అతిథికి భార్యను కానుకగా
హింబా తెగలో ఒక విచిత్రమైన సాంప్రదాయం కూడా ఉంది. అది చాలామందికి జుగుప్సాకరమైనదే. కానీ హింబా తెగలో మాత్రం అది ఎలాంటి నేరము కాదు. ఎవరైనా తమ ఇంటికి ఆతిధ్యాన్ని స్వీకరించడానికి వస్తే.. అతడు మగ వ్యక్తి అయితే ఒక రాత్రికి ఆ అతిథితో తన భార్యను ఉంచేందుకు భర్త అనుమతి ఇస్తాడు. ఇది ఆ తెగలో ఏమాత్రం తప్పు కాదు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×