E-Paper
Advertisement

Animal Behavior: ప్రమాదం జరగబోతుందని కుక్కలెలా పసిగడతాయ్? ఈ నిజాలు తెలిస్తే షాకవ్వడం మీ వంతు!

Animal Behavior: ప్రమాదం జరగబోతుందని కుక్కలెలా పసిగడతాయ్? ఈ నిజాలు తెలిస్తే షాకవ్వడం మీ వంతు!
Advertisement

Animal Behavior: మన ఇంటి పెంపుడు జంతువులు గానీ ఏదైనా జంతువులు గానీ కొన్నిసార్లు ఉన్నట్టుండి గెట్టిగా అరడవం లేదా వింతగా ప్రవర్తించడం చేస్తుంటాయి. కొన్ని నిమిషాలు లేదా గంటల ముందే, భయంతో అరుస్తూ అటూ ఇటూ తిరగడం గమనించే ఉంటాం. ఇలాంటి ప్రవర్తనను చూసి చాలామంది ‘వీటికి సిక్త్ సెన్స్ ఉంది’ అని అనుకుంటారు.

నిజానికి కుక్కలు భూకంపం, తుఫాన్ వంటివి రాబోయే ప్రమాదాలను గుర్తించగలవు. వాయు, శబ్దం, భూక్షేత్ర మార్పులు వాటి సూక్ష్మ ఇంద్రియాలను చేస్తాయి. దీంతో కుక్కలు ముందే ప్రమాదం జరగబోతున్నట్లు హెచ్చరిస్తాయి.

Advertisement

కుక్కలు మనకంటే ఎక్కువగా శబ్దాలను, వాసనలను గుర్తించగలవు. వినికిడి శక్తిలో, మనుషులు వినగల శబ్దాల ఫ్రీక్వెన్సీ పరిమితి కంటే, కుక్కలు చాలా తక్కువ లేదా చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న శబ్దాలను కూడా గుర్తించగలవు. భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి కొన్ని నిమిషాలు ముందే, భూమి లోపల ఏర్పడే సున్నితమైన కంపనాలు, అతి తక్కువ శబ్దాలను కుక్కలు తమ చెవుల ద్వారా గమనిస్తాయి.

ఇక వాసనశక్తి విషయంలో కుక్కల సామర్థ్యం మనిషి కంటే.. వేలరెట్లు ఎక్కువ. తుఫాన్ లేదా వాతావరణంలో పెద్ద మార్పులు వచ్చినప్పుడు గాలిలో ఏర్పడే రసాయనాలు, ఓజోన్ మార్పులు, లేదా భూమి లోపలి గ్యాస్‌ల వాసనను అవి సులభంగా గుర్తించగలవు. మన మెదడు ఈ మార్పులను విశ్లేషించలేకపోయినా, కుక్కలకు ఇవి రాబోయే ప్రమాదానికి సహజ హెచ్చరికలుగా మారతాయి.

Advertisement

అలాగే కుక్కలు వాతావరణ పీడనంలోని సూక్ష్మ మార్పులను కూడా ముందుగానే గ్రహిస్తాయి. ఈ నేథ్యంలో తుఫాను, భారీ వర్షాలు లాంటివి వచ్చే ముందు గాలి పీడనం తగ్గుతుంది. ఊహించనటువంటి ఈ మార్పులను కుక్కలు వెంటనే గమనించి ఆందోళనతో అలా ప్రవర్తిస్తాయి.

కొన్ని పరిశోధనల ప్రకారం.. భూకంపం వంటి సంఘటనలకు ముందు భూమి నుండి విడుదలయ్యే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ తరంగాలలోని మార్పులను కూడా కుక్కలు సెన్సిటివ్‌గా పసిగట్టగలవు. వీటన్నిటి ఫలితంగా, కుక్కల అసాధారణ ప్రవర్తన రాబోయే విపత్తులకు ఒక సహజ హెచ్చరికగా పనిచేస్తుంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×