BigTV English

Viral Video: బైక్‌పై వెళ్తున్న మహిళతో గుంపుగా ఎగబడి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

Viral Video: బైక్‌పై వెళ్తున్న మహిళతో గుంపుగా ఎగబడి అసభ్య ప్రవర్తన.. వీడియో వైరల్

Viral Video: ఇటీవల ఆకతాయి మూకల అల్లర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు అసభ్యతకు పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నట్లు లక్నో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటన గోమతి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వాస్తవానికి లక్నోలో కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల జలదిగ్బంధం నెలకొంది. తాజ్‌ హోటల్‌ సమీపంలో కూడా రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఈ తరుణంలో రోడ్డుపై ఏర్పడిన నీటి ఎద్దడిలో కొందరు ఆకతాయిలు సరదాగా గడిపారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న యువకుడు, యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.


అల్లరి మూకల అసభ్య ప్రవర్తన

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బైక్ నడుపుతూ ఓ యువకుడు మరియు యువతి వచ్చారు. ఈ తరుణంలో ఆ ఇద్దరిపై అల్లరి మూక అసభ్యకరంగా ప్రవర్తించింది. వారి బండిని ఆపివేసి వారిపై వరద నీటిని కురిపించడం ప్రారంభించారు. బైక్‌ను వెనుక నుండి పట్టుకుని లాగడం వంటి విన్యాసాలు చేశారు. బైక్‌పై నీళ్లు చల్లడం, లాగడంతో బైక్‌ బ్యాలెన్స్‌ తప్పి బైక్‌పై నుంచి యువకుడు, యువతి పడిపోయారు. ఈ సమయంలో మహిళను తాకేందుకు ఆకతాయిలు ప్రయత్నించారు. ఈ ఘటన అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని జనాన్ని చెదరగొట్టారు.


ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దుండగులను పోలీసులు గుర్తిస్తున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటున్నామని లక్నో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై జనాలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో వెలుగులోకి రావడంతో, నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకులలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×