BigTV English
Advertisement

CM Revanth Serious in Assembly: సీతక్కపై అవమానకరమైన మీమ్స్.. సీఎం సీరియస్

CM Revanth Serious in Assembly: సీతక్కపై అవమానకరమైన మీమ్స్.. సీఎం సీరియస్

CM Revanth Reddy Serious in Assembly: తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రభుత్వం, ప్రతిపక్ష సభ్యుల మధ్య పెద్ద వార్ కొనసాగుతున్నది. స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించిన చర్చ సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అభ్యంతరం తెలపడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ పేరిట వర్సిటీ ఏర్పాటు. యూనివర్సిటీలో 17 కోర్సులు ఉంటాయి. బీటెక్ తోపాటు సర్టిఫికెట్ డిప్లొమా కోర్సులూ ఉంటాయి. అత్యున్నత సాంకేతిక నిపుణులను తయారు చేయడమే మా లక్ష్యం. ఫీజుల విషయంలో ఎలాంటి అనుమానాలు అవసరంలేదు. ఏడాదిలో కోర్సుల యావరేజ్ ఫీజు రూ. 50 వేలుగా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు అవసరమైతే ఫీజు రీ-ఎంబర్స్ మెంట్ ఇస్తాం. ముచ్చర్లలో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీకి ఇవాళే భూమిపూజ.

ఈ ఏడాది ఆరు కోర్సుల్లో 200 మందికి అడ్మిషన్లు ఇస్తాం. ఈ-కామర్స్, ఫార్మా, బ్యాకింగ్, యానిమేషన్ కోర్సులు ఈ యూనివర్సిటీలో ప్రారంభంకానున్నాయి. ఎస్బీఐ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ కోర్సులకు ట్రైనింగ్ ఇస్తారు. రెడ్డీ ల్యాబ్స్ ద్వారా ఫార్మా విద్యార్థులకు శిక్షణ ఉంటుంది. ట్రైనింగ్ తరువాత ఆయా సంస్థల్లోనే విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. పబ్లిక్, ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ లో స్కిల్ యూనివర్సిటీ నడుస్తది’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.


అనంతరం బీఆర్ఎస్ సభ్యులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్కిల్ యూనివర్సిటీపై చర్చ జరుగుతుంటే రాజకీయాలు ఎందుకు? అంశాల వారీగా చర్చల్లో ప్రతిపక్షం పాల్గొనాలి. కానీ, ప్రతిపక్షం ఎందుకిలా వ్యవహరిస్తోందో అర్థం కావడంలేదు. మరో రెండ్రోజులు సభ నిర్వహణకు కూడా మేం సిద్ధమే. ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకుంటున్నారు. అక్కలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తారా?. వాళ్లను నేను సొంత అక్కల్లాగే భావించాను. ఒక అక్క నన్ను నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లింది. మరో అక్క కోసం ప్రచారానికి వెళ్తే నా మీద కేసులు నమోదయ్యాయి. సీతక్కపై అవమానకరమైన మీమ్స్ పెడుతున్నారు. వాళ్లను నమ్మిన సొంత చెల్లెలే తీహార్ జైల్లో ఉంది. వాళ్ల మాటలు నమ్మొద్దని ఆ అక్కలకు చెబుతున్నా. ఈ తమ్ముడిని నమ్మిన అక్కలు మంత్రులయ్యారు. సొంత చెల్లెల్ని పట్టించుకోనివారు, ఇక్కడ రాజకీయం చేస్తున్నారు. దళితుడు స్పీకర్ గా ఉన్నందుకే, ప్రతిపక్ష నేత సభకు రావట్లేదు’ అని సీఎం అన్నారు.

Also Read: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత

‘కేసీఆర్ కు సింగిల్ విండో చైర్మన్ పదవిని ఇచ్చింది కాంగ్రెస్సే. వార్డు మెంబర్ కూడా కాని హరీష్ ను మంత్రిగా చేసింది వైఎస్సే. మాట్లాడమని మైక్ ఇస్తే శాపనార్థాలు పెడుతున్నారు. మైక్ ఇవ్వకపోతే పోడియం ముందు ఆందోళన చేస్తున్నారు. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉంటే నన్ను ఒక్కరోజూ మాట్లాడనివ్వలేదు. కోమటిరెడ్డి, సంపత్ లకు చేయని నేరానికి శిక్ష వేశారు. అక్కల మంచి కోరే చెబుతున్నా, వాళ్లను నమ్మకండి.

వర్గీకరణపై ఎస్సీలు సంతోషంగా ఉండొద్దా..? ఒక దొర చేతిలో మా అక్కలు చిక్కుకున్నారు. అక్కడ ఉండలేక, బయటకు రాలేక ఆ అక్కలు మదనపడుతున్నారు. స్కిల్ యూనివర్సిటీకి బీజేపీ సభ్యులు అండగా నిలిచారు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×