E-Paper
Advertisement

Korean Queen Statue: అయోధ్యలో కొరియా రాణి విగ్రహం.. 2000 ఏళ్లనాటి చారిత్రక బంధం వెనుకున్న కథేంటో తెలుసా?

Korean Queen Statue: అయోధ్యలో కొరియా రాణి విగ్రహం.. 2000 ఏళ్లనాటి చారిత్రక బంధం వెనుకున్న కథేంటో తెలుసా?

Korean Queen Statue: భారత్‌-దక్షిణ కొరియా సంబంధాలకు ఆధునిక కాలమే ఆరంభమని భావించేవారికి.. అయోధ్యలో చోటుచేసుకున్న ఒక అరుదైన సంఘటన కొత్త కోణాన్ని చూపిస్తోంది. వేలఏళ్ల క్రితమే ఈ రెండు దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధం ఉందని సూచించే చారిత్రక ఆధారం తాజాగా వెలుగులోకి వచ్చింది. శ్రీరాముడి జన్మస్థలంగా ప్రసిద్ధి చెందిన అయోధ్యలో.. కొరియా దేశానికి చెందిన రాణి హెయో హ్వాంగ్-ఓక్‌ (భారతీయ సంప్రదాయంలో సురి రత్నగా ప్రసిద్ధి) కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సంఘటన భారత్‌-కొరియా మధ్య ఉన్న పురాతన సాంస్కృతిక బంధాన్ని మరోసారి గుర్తు చేస్తోంది.

2000 ఏళ్ల నాటి కథ:

కొరియన్ చారిత్రక గ్రంథాలు, ఇతిహాసాల ప్రకారం.. క్రీ.శ. 48 ప్రాంతంలో అయోధ్యకు చెందిన ఒక యువరాణి దైవాజ్ఞ మేరకు సముద్ర మార్గంలో కొరియాకు ప్రయాణించారు. ఆమెనే సురి రత్నగా పిలుస్తారు. అక్కడ గయ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు కిమ్ సురోను ఆమె వివాహమాడారు. ఈ వివాహమే కొరియా చరిత్రలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది.

60 లక్షల మంది మూలాలు భారత్‌లో:

ఈ దంపతులకు పది మంది సంతానం కలిగారని, వారి వారసులే నేటి దక్షిణ కొరియాలో ‘కరక్’ వంశంగా గుర్తింపబడుతున్నారని చారిత్రక విశ్వాసం. ప్రస్తుతం సుమారు 60 లక్షల మంది ఈ వంశానికి చెందినవారు ఉన్నారని అంచనా. వీరంతా తమ మూలాలు భారతదేశంలోని అయోధ్యతోనే ముడిపడి ఉన్నాయని గర్వంగా చెబుతుంటారు.

2001లో సురి రత్న పార్క్:

ఈ చారిత్రక అనుబంధాన్ని గుర్తుచేసేలా.. 2001లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, దక్షిణ కొరియాలోని గిమ్హే నగర పాలక సంస్థ కలిసి సరయూ నది తీరంలో రాణి సురి రత్న స్మారక పార్క్‌ను ఏర్పాటు చేశాయి. కొరియా ప్రతినిధుల అభ్యర్థన మేరకు ఇటీవలి కాలంలో ఈ పార్క్‌ను మరింత అభివృద్ధి చేసి, అందులో రాణి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ అభివృద్ధి పనులకు 2018లో దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ జంగ్-సూక్ భారత పర్యటన సందర్భంగా శ్రీకారం చుట్టారు. అప్పటి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ఆమె ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషం.

బలపడుతున్న సోదర బంధం:

ప్రతి సంవత్సరం కరక్ వంశానికి చెందిన వందలాది మంది కొరియన్లు అయోధ్యకు వచ్చి తమ పూర్వీకురాలిగా భావించే సురి రత్నకు నివాళులు అర్పిస్తుంటారు. తాజా విగ్రహ ప్రతిష్టతో అయోధ్య-గిమ్హే నగరాల మధ్య ఉన్న సోదర నగరాల బంధం మరింత బలపడింది. ఈ పరిణామం భారత్‌, దక్షిణ కొరియా మధ్య ఉన్న సంబంధాలు కేవలం రాజకీయ లేదా దౌత్య పరమైనవే కాకుండా.. లోతైన చారిత్రక, సాంస్కృతిక మూలాలు ఉన్నాయని మరోసారి స్పష్టం చేస్తోంది.

Related News

ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు.. కానీ డ్యూటీలో చేరే లోపే రిటైర్ అయిపోయాడు!

ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్‌లో విచిత్ర సమస్య!

హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

ఇదెక్కడి విచిత్రం సామి! 20 ఏళ్ల తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం.. ట్విస్ట్ ఏంటంటే?

ఐటీ జాబ్‌కు గుడ్‌బై చెప్పి.. ఆటో నడుపుతున్న మహిళ.. నెల సంపాదన తెలిస్తే షాకే!

పక్షులు తమ గూట్లో పాముల కుబుసం ఎందుకు పెట్టుకుంటాయి? అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాకే!

వైరల్ వీడియో .. కేవలం రూ. 1600 ఖర్చుతో ఏసీ.. సామాన్యుడి టాలెంట్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

×