BigTV English

Man Fights with Kangaroo: కుక్కను కిడ్నాప్ చేసిన కంగారు.. విడిపించటానికి దానితో ఫైట్ చేసిన వ్యక్తి!

Man Fights with Kangaroo: కుక్కను కిడ్నాప్ చేసిన కంగారు.. విడిపించటానికి దానితో ఫైట్ చేసిన వ్యక్తి!

Kangaroo Kidnaped a Dog: పెంపుడు కుక్కలు తప్పిపోయినప్పుడు చాలా బాధపడతారు. వాటి కోసం పోస్టర్లు, ప్రకటనలు ఇస్తుంటారు. కొంతమంది పెంపుడు కుక్కలు చనిపోతే వాటి జ్ఞాపకార్థంగా సమాధులు విగ్రహాలు కట్టిస్తుంటారు. మరికొందరైతే వాటిపై ఉన్న పిచ్చి ప్రేమతో బర్త్ డే, బారసాల, శ్రీమంతాలు కూడా చేస్తున్నారు. పెట్స్ హెల్త్ కోసం మంచి ఫుడ్, బట్టలు వాటికి ఏసీ గదులు కూడా ఏర్పాటు చేసినవాళ్లు ఎందరో ఉన్నారు.పెట్స్ పక్కలో లేకుంగా కొందరికైతే నిద్రకూడ పట్టదు. పెట్స్ అంటే అంత ప్రేమ చూపుతారు.


అయితే ఆస్ట్రేలియాలో ఓ పెట్‌ను కంగారూ ఎత్తుకెళ్లింది. దీని కోసం ఆ పెట్ యాజమాని ప్రాణాలకు తెగించి తన పెట్‌ను కాపాడుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాలో పాములు, సాలెపురుగులతో సహా అనేక జీవులు విచ్చలవిడిగా తిరుగుతుంటాయి. అందుకే ఆ దేశానికి వెళ్లిన ఇతర దేశస్థులు వాటిని భయంతో సచ్చిపోతారు. ఇవి కాకుండా మనుషులను బయపెట్టే అనేక జంతువులు కూడా ఇక్కడ సంచరిస్తుంటాయి. ప్రస్తుతం అటువంటి వీడియోనే ఒకటి ఆస్ట్రేలియా నుంచి బయట ప్రపంచానికి వచ్చింది. ఆ వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్చపోతారు.


ఈ వీడియోలో కంగారూ తన చేతులతో కుక్కను ఈడ్చుకెళ్లడం కనిపిస్తుంది. కంగారూ చేతిలో చిక్కిన ఆ కుక్క దాని చేతిలో నుంచి తప్పుంచుకోలేక నిస్సహాయంగా ఉండిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియీాతో ఫుల్‌గా వైరల్ అవుతోంది. భారీ ఆకారంతో రెండు మీటర్లు పొడవున్న కంగారూ.. ఎటునుంచి వచ్చిందో గానీ కుక్కను చెరువు నీటిలోకి ఈడ్చుకెళ్లింది. ఆ కుక్క ఏ రకంగా తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా చేతి గోళ్లతో గట్టిగా పట్టుకుంది.

ఈ కుక్క మిక్ మోలే అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క అనేది తెలుస్తుంది. మిక్‌మోలో తన కుక్కను చెరువు ఒడ్డుకు వాకింగ్‌కు తీసుకువచ్చాడు. అయితే ఈ కుక్కు కాసేపటికి అక్కడి నుంచి అదృశ్యమైంది. ఎంత వెతికినా కుక్క జాడ కానరాలేదు. అలుపు లేకుండా కుక్క కోసం మిక్ వేతుకుతుండగా.. కంగారు చేతిలో చిక్కుకున్న తన కుక్కను చూశాడు. నిస్సహాయంగా ఉన్న కుక్కను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.

మిక్ వెంటనే తన కుక్కను ఎలా అయినా కంగారూ నుంచి రక్షించాలుకున్నారు. అతడు కుక్కకోసం చూస్తుండగా.. అది కూడా అతనే చూస్తూ బాధతో ఉండిపోయింది. కానీ అప్పటికే కంగారు ఆ కుక్కను సగం నీటిలో ముంచేసింది. మిక్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన కుక్క కోసం నీటిలోకి దిగాడు.

మిక్ తన చేతిలో ఉన్న కెమెరాతో ఇదంతా షూట్ చేస్తూనే ఉన్నాడు. ఇంతలోనే ఊహించని విధంగా కంగారూ వద్దకు వెళ్లి కుక్కను విడిపించాడు. దీంతో కంగారూ మిక్‌పై దాడికి పాల్పడింది. ఈ క్రమంలో కెమెరా నీటిలో పడిపోయింది. ఇంతలోనే కంగారూ దృష్టిని ఏమార్చి కెమెరాతో అక్కడి నుంచి బయటపడ్డాడు.

మరో వైపు బతుకు జీవుడా అంటూ ప్రాణాలతో బయటపడ్డ కుక్కు అక్కడి నుంచి పారియపోయి ఇదంతా చూస్తూఉంది. అప్పుడు కంగారూ ఛాతిని పైకి లేపి దాని వైవే చూస్తూ ఉంది. మిక్‌ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. ఇక చేసేది ఏమిలేక నీటిలో అలా చూస్తూ ఉండిపోయింది.

Related News

Kerala: చోరీకి గురైన బంగారం దొరికింది.. కానీ, 22 ఏళ్ల తర్వాత, అదెలా? కేరళలో అరుదైన ఘటన!

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Big Stories

×