Hanumakonda: కోడి కావాలా నాయన అయితే పట్టుకో.. ఎన్ని కోళ్లను పట్టుకుంటే అన్ని కోళ్లు మీవే.. అంటే మీరు ఏంచేస్తారు. మనకు ఎందుకులే అనుకుంటారా లేక పట్టుకుంటారా? అయితే అక్కడి వారు మాత్రం ఏమాత్రం ఆలోచించలేదు. ఆ కోళ్లను పట్టుకునేందుకు ఎగబడ్డారు. దొరికిన కోడిని దొరికినట్టు పట్టుకుపోయారు.
ఈ ఘటన ఎక్కడో కాదు హనుమకొండ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగింది. ఎల్కతుర్తిలో సుమారు రెండు వేల కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్లపై వదిలివెళ్లారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, స్థానికులు ఏమాత్రం ఆలోచించకుండ ఆ కోళ్లను పట్టుకునేందుకు పొలాలు, పత్తి చేనుల వెంట పరుగులు పెట్టారు. దొరికినకాడికి దొరికినన్నీ కోళ్లను పట్టుకుపోయారు. అయితే ఒక్క కోడి సరిపోదనుకున్నారో ఏమోకానీ.. కొందరైతే ఏకంగా పదుల కొద్ది కోళ్లను పట్టుకుని సంచుల్లో వేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఒకరి వెంట ఒకరి ఊరంతా ఈ నాటు కోళ్ల సమాచారం తెలియడంతో.. పొలాల వైపు పరుగులు తీశారు. కోళ్ల వెంటపడి మరీ పట్టుకుని వాటిని ఇండ్లకు తీసుకెళ్లారు. సుమారు 2000 కోళ్లు ఊరు ప్రజలకు చిక్కడంతో ఊరంతా కోడికూర స్మెల్లే.. ఈ ఊరి ప్రజలంతా లొట్టలేసుకుంటూ నాటుకోడి కూరతో కడుపు నిండా తిని తెగ ఎంజాయ్ చేశారు.. కానీ ఆ కోళ్లను ఎవరు వదిలి వెళ్లారు..! ఎందుకు వదిలి వెళ్లారు..! వాటికి ఏమైనా వ్యాధి సోకిందా..! ఎందుకు అలా వేలుకు పైగా కోళ్లను ఊరు చివర్లో వదిలి వెళ్లారో మాత్రం ఇప్పటివరకు ఎవరికీ అంతు చిక్కని మిస్టరీగా ఉంది.
Also Read: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!
కోళ్ళు వదిలి వెళ్ళింది ఎవరు అనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదవశాత్తు పడిపోయాయా…? ఎవరైన తీసుకువచ్చి వదిలేశారా..? అనే కోణంలో సీసీ పుజేజ్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
కోళ్లు వదిలిపోయిన ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోళ్ల ఆరోగ్య పరిస్థితిపై పలు విధాల చర్చ సాగుతుంది. కోళ్లకు ఏమైనా వైరస్ ఉందా లేకుంటే రోగం ఉందా అనే అనుమానంతో కొన్ని కోళ్ల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించినట్లు పశు వైద్య అధికారులు తెలిపారు. పరీక్షల ఫలితాలు వచ్చే వరకు ఆ కోళ్ళు తనవద్దని అధికారులు పేర్కొన్నారు.