E-Paper
Advertisement

Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..

Man Marries sister: వధువు చేయి చూసి పెళ్లి ఆపేసిన వరుడి తల్లి.. ఏం జరిగిందంటే..
Advertisement

Man Marries sister| పెళ్లి అనగానే అందరూ ఎన్నో కలలు కంటారు. తమ జీవితంలో వచ్చే వ్యక్తితో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు అనుకున్నవననీ జరగవు. మనిషి ఒకటి తలిస్తే.. విధి మరొకటి ఉంది. అలాంటిదే ఒక ఘటనలో ఓ యువకుడు పెళ్లి చేసుకోవాలని కళ్యాణ మండపానికి వెళ్లాడు. అక్కడ అందరి ముందు పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగా.. అతని తల్లి పెళ్లి కూతురి చేయిని చూసింది. అంతే ఆమె ముఖానికి చెమటలు పట్టాయి. వెంటనే ఆమె.. ”ఈ పెళ్లిని ఆపండి. పెళ్లి జరగదు” అని అరిచింది. ఈ ఘటన చైనాలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. చైనాలో ఓ యువకుడికి పెళ్లి చేయడానికి అతని తల్లి ఒక మంచి అమ్మాయిని చూసింది. పెళ్లి కొడుకు కూడా ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి కుటుంబం కూడా పెళ్లికి అంగీకరించింది. ఇక ఇరు కుటుంబాలు పెళ్లి కార్యక్రమాల్లో మునిగిపోయారు. పెళ్లి కోసం ఒక పెద్ద కళ్యాణ మండపం బుక్ చేశారు.

Advertisement

మరోవైపు యువకుడు తనకు కాబోయే పెళ్లికూతురితో కొంత కాలం డేటింగ్ చేశాడు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. బయట డిన్నర్లకు వెళ్లారు. ఇద్దరూ ప్రేమించుకొని జీవితాన్ని కలిసి సుఖంగా గడపాలనుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి రోజు రానే వచ్చింది.

కళ్యాణ మండపానికి పెళ్లి కొడుకు కుటంబమంతా చైనా సంప్రదాయం ప్రకారం.. పాటలు పాడుతూ బయలుదేరింది. అక్కడ పెళ్లికూతురు అందంగా ముస్తాబైంది. ఆమెను చూసినవారంతా చాలా అందంగా ఉందని చెబుతున్నారు. దీంతో పెళ్లి కొడుకు తల్లి పెళ్లికూతురుని చూసేందుకు వెళ్లింది.

Advertisement

బయట చైనా సంప్రదాయం ప్రకారం.. ఇంకాసేపట్లో పెళ్లి జరుగబోతోందనుకున్న సమయంలో లోపలికి వెళ్లిన వరుడి తల్లి గట్టిగా అరిచింది. ఆమె పెళ్లికూతురిని పట్టుకొని గట్టిగా ఏడుస్తోంది. ఆమె అరుపులు విని.. ఏమైందో అని వరుడు కుటుంబ సభ్యులంతా అక్కడికి చేరుకున్నారు. అక్కడ వరుడి తల్లి ముఖానికి చెమటలు పట్టి ఉండడం చూసి.. ఏం జరిగిందోనని అందరూ కంగారు పడిపోయారు.

Also Read: ఫారిన్‌లో ఉద్యోగం చేస్తున్న యువకుడు.. పెళ్లికి ముందు యువతిని ఎలా మోసం చేశాడంటే..

అప్పుడా వరుడి తల్లి ఈ పెళ్లి జరగదు అని అందరికీ చెప్పింది. దానికి కారణం వివరిస్తూ.. పెళ్లికూతురి చేయిని చూపింది. పెళ్లి కూతురి చేతిపై ఒక గుర్తు ఉంది. ఆ గుర్తు తన కూతురి చేతిపై మాత్రమే ఉంటుందని.. ఆ పెళ్లి కూతురు మరెవరో కాదు.. తనకు పుట్టిన బిడ్డ అని చెప్పింది. 20 ఏళ్ల క్రితం తన చిన్నారి కూతురు తప్పిపోయిందని తెలిపింది. అప్పుడు పెళ్లి కూతరు తల్లిదండ్రులు కూడా.. ఆమె తమకు పుట్టిన బిడ్డ కాదని.. రోడ్డు మీద అనాథగా ఏడుస్తుంటే దత్తత తీసుకున్నామని చెప్పారు.

ఇంకేముంది తల్లీకూతుళ్లు ఏడుస్తూ కౌగిలించుకున్నారు. కానీ వరుడికి ఇక పెళ్లికూతురు చెల్లెలు కావడంతో ఆ పెళ్లి జరగదు. అయితే కాసేపు తరువాత వరుడి తల్లి తన కొడుకు ముఖం చూసి.. తన నిర్ణయం మార్చుకుంది. ఈ పెళ్లి జరుగుతుందని చెప్పింది. అదెలా అని అందరూ ప్రశ్నించగా.. వరుడు తనకు పుట్టిన బిడ్డ కాదని.. తన స్నేహితురాలు చనిపోతే ఆమె కొడుకుని తన బిడ్డగా పెంచుకున్నానని మరో రహస్యం వెల్లడించింది. ఇలా పెళ్లిలో షాకుల మీద షాకులు. చివరికి ఆ పెళ్లి జరిగింది. ఈ ఘటన 2021లో జరిగింది. అయితే దాని గురించి ఈ మధ్య మీడియాలో రావడంతో బాగా వైరల్ అవుతోంది.

Also Read: ‘రైల్వే ఉద్యోగం కావాలా? రూ.20 లక్షలు ఖర్చు అవుతుంది!’.. యువతిని మోసం చేసిన ‘అమిత్ షా సెక్రటరీ’

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×