BigTV English
Advertisement

QR Code T-Shirt: ఏం ఐడియా గురూ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా టీషర్ట్‌పై క్యూఆర్ పెట్టేసావ్ గా..!

QR Code T-Shirt: ఏం ఐడియా గురూ.. గర్ల్‌ఫ్రెండ్ కోసం ఏకంగా టీషర్ట్‌పై క్యూఆర్ పెట్టేసావ్ గా..!

QR Code T-ShirtQR Code T-Shirt: ప్రస్తుతం కాలంలో పాటుగా యువతీ, యువకుల అభిరుచులు కూడా మారుతున్నాయి. పాశ్యాత్య దేశాలు మాదిరిగా మనదేశంలో కూడా ఇప్పుడిప్పుడే యువత కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. పెళ్లితో సంబంధం లేకుండా ఒకరుతో ఒకరు సంబంధాలు కలిగి ఉంటూ డేటింగ్ పేరుతో ఆనందంగా గడుపుతున్నారు. మన దేశంలో కొంత కాలంగా డేటింగ్ యాప్ లు కూడా బాగా ప్రాచార్యంలోకి వచ్చాయి. దీంతో యువత తమ కావాల్సిన జోడీ కోసం ఆన్ లైన్ యాప్స్ వెంట పడడం ప్రారంభించారు. అయితే తాజాగా ముంబయిలో ఒంటరిగా ఉన్న ఓ యువకుడు తనకు సరిపోయే గర్ల్ ఫ్రెండ్ ను వెతకడం చేసిన పనిని చూసి అందరూ షాక్ అవుతున్నారు. అసలు ఏం చేశాడంటే..!


ఇటీవల కాలంలో మన దేశంలో డేటింగ్ యాప్స్ వినియోగిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. తనకి తెలియని వ్యక్తులతో తమ అభిరుచులను పంచుకుని, ఆపై స్నేహం చేసి ఈ తర్వాత డేటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో కుర్రకారు అమ్మాయిలు కోసం ఈ డేటింగ్ యాప్స్ వెంటపడుతున్నారు. అయితే ముంబయికి చెందిన ఓ యువకుడు వేసిన టీసర్ట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్శించింది. ఈ యువకుడు వినూత్నంగా ఆలోచించి తాను వేసుకున్న టీ షర్ట్ పై తనకు డేటింగ్ యాప్ లో అమ్మాయి కావాలంటూ అందరికీ తెలిసేలా చేశాడు. అదెలా అంటే..!

ముంబయిలోని మహాలక్ష్మి రేస్‌కోర్స్‌లో మార్చి 16వ తేదీన ఎడ్ షీరన్ కచేరీ జరుగుతుండడంతో అక్కడి రోడ్లన్నీ బిజీగా ఉన్నాయి. ఆ రోడ్లపై వెళ్తున్న వారంతా 22 ఏళ్ల వయసున్న హార్దిక్ అనే యువకుడ్ని వింతగా చూస్తున్నారు. కారణం ఏంటంటే..! హార్దిక్ తాను వేసుకున్న టీ షర్ట్ వెనుక భాగంలో ఓ క్యూడ్ ఉంది. దానిపై ”ఒంటరి వ్యక్తుల కోసం” అని రాసి ఉంది. దీంతో అందరూ ఆయన్ను వింతగా చూడడం ప్రారంభించారు. కొందరైతే ఏం ఐడియా గురూ సింగిల్ గా ఉన్నానంటూ ఇలా కూడా ప్రచారం చేసుకోవచ్చా అని అంటున్నారు. మరి కొందరైతే అతను వేసుకున్న టీ షర్ట్ ను ఫోటోలు ట్వీట్టర్ లో షేర్ చేశారు. మరికొరకు హార్దిక్ రోడ్లపై నడుస్తున్న వీడియోను ట్వీట్టర్(ఎక్స్) లో పోస్ట్ చేశారు. దీంతో హార్దిక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


Also Read: Brown Snake in Cupboard: చెడ్డీల పెట్టెలో పాము.. చూసి గుండె ఆగినంత పనైంది!

హార్దిక్ వినూత్నంగా ఆలోచించి టీ షర్ట్ పై ప్రముఖ డేటింగ్ యాప్ అయిన్ టిండర్ ప్రొఫైల్ ను క్యూ ఆర్ కోడ్ రూపంలో ముద్రించాడు. ఒంటరిగా ఉన్న మహిళలు తన టీ షర్ట్ వెనుక ఉన్న క్యూ ఆర్ స్కాన్ చేసి తన అకౌంట్ డిటెయిల్స్ తెలుసుకోవచ్చు అంటూ ప్రచారం చేసుకున్నాడు. నచ్చితే తనతో డేటింగ్ కూడా చేయవచ్చు అని చెబుతున్నాడు. కొందరు అతని టిండర్ అకౌంట్ స్కాన్ చేసి.. వివరాలను ఎక్స్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి.

Tags

Related News

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

Big Stories

×