BigTV English

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

Supreme Court : సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..
Citizenship Amendment Act
Citizenship Amendment Act

Citizenship Amendment Act: కేంద్ర ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం .. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. సీఏఏ అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.


ఈ చట్టంతో ఏ వ్యక్తి పౌరసత్వం తొలగించమని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల తర్వాత  జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం  కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. 3 వారాల్లోపు సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.

2019లో సీఏఏ పార్లమెంట్ ఆమోదం పొందింది. ఆ తర్వాత అనేక మంది పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ సమయంలోనూ కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. అయితే అప్పటికి నిబంధనలు నోటిపై చేయలేదని కేంద్రం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. చట్టం అమల్లోకి రాలేదని నాడు సుప్రీంకి తెలిపింది. తాజాగా సీఏఏ నిబంధనలు-2024 నోటీ చేసింది. దీంతో సీఏఏ అమల్లోకి వచ్చింది.


Also Read: రిట్ పిటిషన్ ను వెనక్కి తీసుకున్న ఎమ్మెల్సీ కవిత

సీఏఏను సవాల్ చేస్తూ ఇప్పటికే 200 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ చట్టం అమలుపై స్టే విధించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు మాత్రమే ఇచ్చింది. చట్టం అమలుపై స్టే విధించలేదు. తుదిపరి విచారణ ఏప్రిల్ 9కు వాయిదా పడింది. సీఏఏపై సుప్రీంకోర్టు స్టే విధించకపోవడంతో ఈ చట్టం అమలు కొనసాగుతుంది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×