E-Paper
Advertisement

Viral News: బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త

Viral News: బికినీ వేసుకుంటానన్న భార్య.. ఆమె కోసం ఏకంగా ఐలాండే కొనేసిన భర్త
Advertisement

Dubai Influencer Soudi Al Nadak: భార్య భర్త నుంచి చాలా ఆశిస్తుంది. నచ్చిన నగలు కొనివ్వాలని, లేటెస్ట్ శారీలు ఇప్పటించాలని, సినిమాలకు, షికార్లకు తీసుకెళ్లాలని ఆశపడుతుంది. భార్య అనుకున్న స్థాయిలో కాకపోయినా భర్త ఆమెకు నచ్చే వస్తువులను కొనిస్తూనే ఉంటాడు. అంబానీ లెవల్ లో కాకపోయినా పెళ్లికాని ప్రసాద్ రేంజ్ లో రోజూ మల్లెపూలు, వారం వారం సినిమాల, అటు నుంచి అటే డిన్నర్, అప్పుడో ఇప్పుడో చీరలు, ఎప్పుడో ఒకసారి నగలు ఇప్పటించి సర్ ప్రైజ్ చేస్తుంటారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట చాలా స్పెషల్. భార్య అడగాలే కానీ, కొండమీది కోతినైనా తెచ్చేరకం ఈ భర్త. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..

భార్య బికినీ వేసుకునేందుకు ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు

Advertisement

సౌదీ అల్ నదక్ అనే 26 యువతి దుబాయ్ లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. పెద్ద సంఖ్యలో ఆమెకు ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన సోషల్ మీడియా ద్వారా ఏ వీడియో షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ఈ ముద్దుగుమ్మకు ఓ కోరిక కలిగింది. ఒంటరిగా ఓ ఐలాండ్ లో బికినీ వేసుకుని ఎంజాయ్ చేయాలి అనిపించింది. ఇదే విషయాన్ని తన భర్తకు చెప్పింది. చేతిలో డబ్బులు ఉన్నాయి. భార్య కోరిక నెరవేర్చడంలో తప్పేం ఉంది అనుకున్నాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఐలాండ్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం ఏకంగా 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. నీకు నచ్చినట్లు ఉండు అని చెప్పేశాడు. ఈ విషయాన్ని స్వయంగా సౌదీ వెల్లడించింది.

చార్టర్డ్ జెట్ ఐలాండ్ కు వెళ్లే వీడియోను షేర్ చేసిన సౌదీ

Advertisement

భర్త కొనుగోలు చేసిన ఐలాండ్ లోకి అడుగు పెట్టే వీడియోను సౌదీ షేర్ చేసింది. ఈ వీడియోలో భార్య భర్త కలిసి చార్టర్డ్ జెట్ ద్వారా ఐలాండ్ కు వెళ్తూ కనిపించారు. జెట్ లో నుంచి తీసిన వీడియో విలాసవంతమైన ఐలాండ్ ఆహ్లాదంగా కనిపించింది. ఐలాండ్ చుట్టూ ఎత్తైన కొబ్బరి చెట్లు, సరస్సులతో నిండి ఉంది. తన భర్త ఇవ్వెస్ట్ చేసిన వాటిలో ఇది బెస్ట్ ఇన్వెస్ట్ అంటూ సౌదీ వెల్లడించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు 2.5 మిలియన్ల వ్యూస్ అందుకుంది.

ఫన్నీగా రియాక్ట్ అవుతున్న నెటిజన్లు

సౌదీ షేర్ చేసిన ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “బికినీ వేసుకోవడానికి ఐలాండ్ కొనడం అవసరమా? పూల్ కో, బీచ్ కో వెళ్తే సరిపోతుంది కదా?” అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “పేదలకు ఆ డబ్బును సాయం చేస్తే ఇంకా బాగుండేది” అని మరొకరు కామెంట్ పెట్టారు. “ఇలాంటి భార్య ఉంటే ఆ భర్త ఎక్కువ కాలం బిలియనీర్ గా ఉండలేడు” అంటూ మరొకరు రాసుకొచ్చారు. “డబ్బును ఖర్చు చేయడం మానుకొని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోవాలి” అంటూ ఇంకో నెటిజన్ సలహా ఇచ్చాడు.

ప్రేమ వివాహం చేసుకున్న సౌదీ అల్ నదక్

సౌదీ అల్ నదక్ స్టైలిష్ లైఫ్ స్టైల్ గడుపుతుంది. విపరీతంగా షాపింగ్స్ చేయడం, లగ్జరీ వాహనాల్లో ప్రయాణించడం, ఫస్ట్ క్లాస్ ఫైట్ జర్నీకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటుంది. నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోదు. 6 ఏండ్ల వయసులో దుబాయ్ కి వెళ్లిన సౌదీ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో జమాల్ అల్ నదక్‌ను కలిసింది. మూడేళ్ల ప్రేమ తర్వాత వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.

Read Also: ఆటో డ్రైవర్ ఎంత అప్డేట్ అయ్యాడు గురూ.. పేమెంట్స్ కోసం వినూత్న ఆలోచన

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×