BigTV English

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Pakistan: సౌదీలో బిచ్చగాళ్ల మాఫియా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!

Saudi Arabia warns Pakistan: హజ్ యాత్రలో భాగంగా మక్కా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం ఇస్లాం మతస్తుల జీవిత లక్ష్యం. ఇందులో భాగంగానే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు జీవితంలో కనీసం ఒక్కసారైనా పవిత్ర మక్కాను సందర్శించాలని అనుకుంటారు. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రతీ ఏటా హజ్ యాత్ర పేరిట కొంతమందిని మక్కాను దర్శించుకునేలా చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ఉమ్రా, హజ్ వీసాలతో పాకిస్థాన్‌ నుంచి పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లు వస్తున్నట్లు తేలింది. దీంతో సౌదీ అరేబియాలో బిచ్చగాళ్ల మాఫియా కొనసాగుతోంది.


పాకిస్థాన్‌.. బిచ్చగాళ్లను యాత్రల పేరిట పంపిస్తోందంటూ సౌదీ అరేబియా ఆరోపించింది. ఉమ్రా వీసాలతో సౌదీలోకి ప్రవేశించే బిచ్చగాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తుందని సౌదీ హజ్ మంత్రిత్వశాఖ అధికారికంగా హెచ్చరించింది. ఈ వ్యక్తుల కారణంగా పాకిస్థాన్‌ యాత్రికుల ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని సౌదీ అధికారులు ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు. కావున ఈ విషయాన్ని పాకిస్థాన్‌ వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

పాకిస్థాన్‌కు చెందిన కొంతమంది బిచ్చగాళ్లు ఉమ్రా, హజ్ వీసాలతో సౌదీ అరేబియా దేశంలోకి వస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ఆరోపిస్తుంది. అయితే ఇప్పటికే భిక్షాటన చేస్తున్న చాలామంది పాకిస్థాన్‌ పౌరులను పట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయితే పట్టుకున్న పాకిస్థాన్‌ జాతీయులను వెంటనే వారి దేశానికి పంపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై పాకిస్థాన్‌ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సైతం నిర్ధారించింది.


ఈ విషయంపై పాకిస్థాన్‌ హోంమంత్రి మొహిసిన్ నక్వీ స్పందించారు. బిచ్చగాళ్లను పెద్ద సంఖ్యలో సౌదీ అరేబియాకు పంపించడం ఓ మాఫియానే పనిచేస్తుందని ఆరోపించింది. ఈ బెగ్గర్ మాఫియా పాకిస్థాన్‌ పరువును నాశనం చేస్తుందని మండిపడ్డారు. ఇప్పటికే ఈ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని ఆదేశించినట్లు తెలిపారు.

Also Read: బంగ్లాదేశ్‌లో అరాచకం.. దుర్గాపూజపై ఆంక్షలు.. నిర్వహించవద్దని హెచ్చరికలు!

ఇదిలా ఉండగా, ఉమ్రా పర్యటన మరింత సులభతరం చేసేందుకు పాకిస్థాన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ట్రావెల్ ఏజెన్సీలను నియంత్రించేందుకు పాకిస్థాన్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉమ్రా చట్టంను ప్రవేశ పెట్టాలని ఆలోచిస్తుంది. ఇందులో కఠిన చర్యలు అమలు చేసేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

కాగా, గతేడాది సైతం పాకిస్థాన్ యాత్రికుల విషయంలో విదేశీ పాకిస్థాన్‌ల కార్యదర్శి అర్షద్ మహమూద్ ఆందోళన వ్యక్తం చేశాడు. కొంతమంది నేర కార్యకలాపాల్లో పాల్గొనడంపై ఆందోళన చెందినట్లు పాకిస్థాన్ అధికారులు సైతం నివేదించారు.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న హజ్ యాత్రకు అధిక సంఖ్యలో తరలివెళ్తుంటారు. హజ్ సాంప్రదాయాలను అనుసరించి అల్లాను ముస్తింలు పూజిస్తారు. హజ్ చరిత్ర విషయానికొస్తే.. మహ్మద్ ప్రవక్త కాలం నుంచి నాటి పుణ్యక్షేత్రానికి సాగించే యాత్రగా హజ్ యాత్ర పేరుగాంచింది. 632 సంవత్సరంలో మహ్మద్ ప్రవక్త తన అనుచరులతో కలిసి మదీనా నుంచి మక్కాకు జరిపిన యాత్రను తొలి హజ్ యాత్రగా పేర్కొంటారు. మక్కా చేరుకున్న అనంతరం అల్లా నివాసంగా మహ్మద్ ప్రవక్త ప్రకటించారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×