BigTV English

Viral Video: టెర్రస్‌పై లవర్స్ ముచ్చట్లు.. పొరుగువారి సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు..

Viral Video: టెర్రస్‌పై లవర్స్ ముచ్చట్లు.. పొరుగువారి సమాచారంతో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు..

Viral Video: సోషల్ మీడియా అనేది ఎప్పుడైనా ఏదైనా వైరల్ అయ్యే వేదిక. ఇక్కడ తరచూ వివాహాలు, నృత్యం మరియు పలు ఫన్నీ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. అయితే కొన్ని సార్లు నిత్యం అందరి జీవితాల్లో జరిగే చాలా రకాల సన్నివేశాలు కూడా చర్చనీయాంశం అవుతుంటాయి. ఏదో సరదాగా తీసిన వీడియోలు కూడా కొన్ని సార్లు అందరినీ ఆకర్షిస్తుంటాయి. అయితే తాజాగా అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో లవర్స్ వీడియోలు ఎప్పుడూ హల్ చల్ చేస్తుంటాయి. లవర్స్ వారు సరదాగా తీసుకునే వీడియోలు ఎక్కువగా ఉంటే, కొన్ని సార్లు వారి ప్రేమ గురించి పెద్దలకు తెలియడం వంటి వీడియోలు కూడా ఉంటాయి. అయితే తాజాగా ఇద్దరు ప్రేమికులు ఇంట్లో వారికి దొరికిపోయిన వీడియో వైరల్ అవుతోంది.


తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్‌ కలిసి ఇద్దరు ముచ్చట్లు పెడుతున్నారు. సీక్రెట్ గా గర్ల్ ఫ్రెండ్ ఇంటి మేడపైకి వచ్చిన బాయ్ ఫ్రెండ్ తనను కలిసి ముచ్చట్లు పెడుతూ ఇరుగుపొరుగు వారికి దర్శనమిచ్చారు. దీంతో ఒక్కసారిగా వారంతా గర్ల్ ఫ్రెండ్ తల్లికి వారిద్దరు కలిసి ముచ్చట్లు పెట్టడం, తెలియకుండా తమ ఇంట్లోకి వేరే వ్యక్తి ప్రవేశించాడని అమ్మాయి తల్లికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఒక్కసారిగా అమ్మాయి తల్లి మేడ పైకి వచ్చి వెతకడం మొదలుపెట్టింది. దీంతో ఎంత వెతికినా కూడా అబ్బాయి దొరకలేదు. ఈ తరుణంలో అమ్మాయి కంగారుతో ఎక్కడ దొరికిపోతారో అని ఆలోచనలో పడింది. ఈ తరుణంలో అక్కడే ఉన్న ఓ గోడ చాటున దాక్కోవడం చూసిన తల్లి, అతడిని బయటకు లాగి చితకబాదింది. దీనికి సంబంధించిన వీడియోను ఇరుగు పొరుగు వారు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కలవడానికి ఏకంగా ఇంటికే వెళ్తారా అని ఓ వ్యక్తి కామెంట్ చేయగా.. మరొక వ్యక్తి తల్లిదండ్రులు ఉండే సమయంలో కలిస్తే ఇలాగే జరుగుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.


Related News

Viral video: పార్లమెంటును తగలబెట్టేసి రీల్స్ చేసిన జెన్ జెడ్ నిబ్బాలు.. ఇది అవినీతిపై పోరులా లేదే?

Delhi News: మహీంద్రా షోరూమ్‌.. థార్‌ ఎస్‌యూవీ ఒక్కసారిగా పల్టీలు, వైరల్ వీడియో

Gigi Hadid: కేవలం ఆ టేపు చుట్టుకుని నడిచినందుకు రూ.80 కోట్లు చెల్లించారట.. ఇంతకీ దాని ప్రత్యేకత ఏంటీ?

Viral Video: మినీ బస్సులో సముద్రంలో షికారు.. ఒక్క భారీ కెరటంతో సీన్ మారిపోయింది!

Viral News: కొట్టేయడం నా హాబీ.. చోరీ కేసులో మహిళ సర్పంచ్ అరెస్ట్, ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు ఔట్!

Viral Video: పరాయి మగాడితో అడ్డంగా దొరికిన భార్య.. తట్టుకోలేక భర్త..

Big Stories

×