E-Paper
Advertisement

Telangana: విప్లవాగ్ని రగిల్చిన కవి దాశరథి కృష్ణమాచార్య: సీఎం రేవంత్ రెడ్డి

Telangana: విప్లవాగ్ని రగిల్చిన కవి దాశరథి కృష్ణమాచార్య: సీఎం రేవంత్ రెడ్డి
Advertisement

CM Revanth Reddy: జులై 22వ తేదీ.. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలను రగిల్చిన యోధుడు దాశరథి కృష్ణమాచార్యల జయంతి. ఈ ఏడాది జులై 22వ తేదీ కవి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతి అవుతున్నది. సాధారణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి రోజున సాహితీరంగంలో కృషి చేసిన వారికి అవార్డులు ప్రకటిస్తుంది. ఈ సారి శత జయంతి కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డి దాశరథి కృష్ణమాచార్యుల శత జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అంటూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట జ్వాలలను రగిల్చిన యోధుడు మన దాశరథి కృష్ణమాచార్యులని కొనియాడారు. ఆయన తెలుగు, ఉర్దూ, సంస్కృత, ఇంగ్లీష్ భాషల్లో పండితుడని వివరించారు. దాశరథి కృష్ణమాచార్య తన కలం నుంచి ఒక వైపు విప్లవాగ్నులను రగిల్చారని, మరో వైపు అనువాద, ప్రణయ కవిత్వాలను, సినీ గీతాలను వెలువరించిన సవ్యసాచి అని తెలిపారు. దాశరథి పోరాట పటిమ మలి దశ తెలంగాణ ఉద్యమ పోరాటానికి, పోరాట సాహిత్యానికి స్ఫూర్తిగా నిలిచిందని వివరించారు.

Advertisement

Also Read: శ్రావణ మాసంలో లక్ష్మీ-నారాయణ యోగం.. ఈ 3 రాశుల వారి జీవితం డబ్బు మయం

దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సందర్భంగా ప్రతి యేటా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ రంగంలో విశేష కృషి అందించిన వారిని గుర్తించి అవార్డును ప్రకటిస్తున్నారు. ఈ సారి కూడా ప్రభుత్వం వేసిన కమిటీ ఈ అవార్డు కోసం సాహితీపరులపై చర్చ జరిపింది. సిరిసిల్లకు చెందిన ప్రముఖ వచన కవి, రచయిత జూకంటి జగన్నాథంకు ఈ ఏడాది దాశరథి కృష్ణమాచార్య అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవోను కూడా విడుదల చేసింది. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కవి, రచయిత జూకంటి జగన్నాథంకు అభినందనలు తెలిపారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×