BigTV English

Ola Showroom: తన బైక్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను తగులబెట్టిన కస్టమర్.. వీడియో వైరల్

Ola Showroom: తన బైక్ రిపేర్ చేయలేదని ఓలా షోరూంను తగులబెట్టిన కస్టమర్.. వీడియో వైరల్

Ola Customer: ఓ ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ తన బైక్‌ను రిపేర్ చేయడం లేదని షోరూం సిబ్బందిపై సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఏకంగా ఓలా షోరూంకు నిప్పు పెట్టి తగులబెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటన కర్ణాటకలోని కాలబురగి జిల్లాలో చోటుచేసుకుంది.


26 ఏళ్ల మొహమ్మద్ నదీమ్ ఆగస్టు నెలలో ఓలా బైక్‌ను కొనుగోలు చేశాడు. కానీ, కొనుగోలు చేసిన స్వల్ప కాలంలోనే రిపేర్‌కు వచ్చింది. తన బైక్‌ను రిపేర్ చేయాలని ఓలా షోరూంకు వెళ్లాడు. కానీ, అక్కడి స్టాఫ్ తగిన రీతిలో స్పందించలేదని తెలిసింది. అందుకే ఆగ్రహంతోనే షోరూంకు నిప్పు పెట్టినట్టు సమాచారం.

ఈ ఘటనపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. నదీమ్ 20 రోజుల క్రితమే ఓలా బైక్ కొన్నాడని వివరించారు. కానీ, ఆ బైక్‌లో తరుచూ అనేక రకాల సమస్యలు వచ్చాయని తెలిపాడు. ఆ కారణంగా నదీమ్ కొత్తగా కొన్న బైక్‌ను ఓలా షోరూంకు తీసుకెళ్లాడు. కానీ, స్టాఫ్ ఆ సమస్యను సరిగ్గా గుర్తించలేదని తెలిసిందన్నాడు. నదీమ్ తరుచూ షోరూంకు వస్తున్నా.. తన బైక్‌లో ఇష్యూలు రావడంతో ఆగ్రహానికి గురయ్యాడు. ఈ సమస్యలు, ఓలా షోరూం స్టాఫ్ నిర్లక్ష్యంతో విసుగెత్తిన నదీమ్ షోరూంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మంగళవారం ఆ షోరూంకు నిప్పు పెట్టినట్టు ఆ పోలీసు అధికారి వివరించారు.


ఈ ఘటనపై పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడిని విచారిస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేవు. ఆ షోరూంలోని ఆరు స్కూటర్లు కాలిపోయాయి. షోరూంకు నిప్పు పెట్టినప్పుడు అది క్లోజ్ చేసి ఉన్నది. అందులో స్టాఫ్ ఎవరూ లేరు. అయితే.. ఆరు బైక్‌లు, కంప్యూటర్లు, ఫర్నీచర్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కాలబురగి చౌక్ పోలీసు స్టేషన్‌లో కేసు ఫైల్ అయింది.

Also Read: Pregnant: పురిటి నొప్పులని డాక్టర్లకు షాక్ ఇచ్చిన ‘గర్భిణి’.. మీరు కూడా ఖంగుతినడం ఖాయం

 

ఈ ఘటనపై ఓలా కంపెనీ రియాక్ట్ అయింది. కర్ణాటక కాలబురగిలోని తమ షోరూంకు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుందని వివరించింది. ఇందుకు కారణమైన నిందితుడిని తాము గుర్తించామని, ఎఫ్ఐఆర్ నమోదైందని తెలిపింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారని పేర్కొంది. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను ఓలా తీవ్రంగా ఖండిస్తున్నదని స్పష్టం చేసింది. ఈ ఘటనలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాము అవసరమైన న్యాయపరమైన నిర్ణయాలు తీసుకుంటామని వివరించింది.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు వారాల క్రితమే ఓలా షోరూంలో నిప్పులు ఎగిసిపడిన ఘటన తెలిసిందే. ఈ ఘటన మరువకముందే తాజాగా కర్ణాటకలో ఏకంగా కస్టమర్ షోరూంకు నిప్పు పెట్టిన ఘటన చోటుచేసుకుంది.

Tags

Related News

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Big Stories

×