BigTV English

Bigg Boss 8 Telugu: నిఖిల్‌ను ఎమోషనల్ ఫూల్ చేసిన సోనియా.. మధ్యలో మణికంఠ బలి, వారమంతా అదే తిని బ్రతకాలా?

Bigg Boss 8 Telugu: నిఖిల్‌ను ఎమోషనల్ ఫూల్ చేసిన సోనియా.. మధ్యలో మణికంఠ బలి, వారమంతా అదే తిని బ్రతకాలా?

Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో రెండోవారం రేషన్ కోసం కంటెస్టెంట్స్ మధ్య యుద్ధం మొదలయ్యింది. రేషన్ కావాలన్నా, నచ్చిన తిండి తినాలన్నా కంటెస్టెంట్స్ ఆటలు ఆడి గెలవాల్సిందే. అదే బిగ్ బాస్ కొత్త రూల్. ముందుగా హౌజ్‌కు చీఫ్స్ అయిన యష్మీ, నైనికా, నిఖిల్.. రంగంలోకి దిగి వారి టీమ్‌మేట్స్‌కు కావాల్సిన ఆహార పదార్థాలను యాక్షన్ ఏరియా నుండి తెచ్చుకున్నారు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ పెట్టారు బిగ్ బాస్. ఒకవేళ వారు తెచ్చుకున్న రేషన్ వారికి దక్కాలంటే మూడు టీమ్స్ కలిసి ఆట ఆడాల్సిందే అని ఆదేశించారు. అలా మూడు టీమ్స్ మధ్య ఛాలెంజ్‌లు మొదలయ్యాయి. చివరికి అందరి మధ్యలో నాగ మణికంఠ బలి అయిపోయాడు.


మణికంఠ ఒంటరి పోరాటం

మొదటి ఛాలెంజ్ ‘లెమన్ పిజ్జా’లో ఎక్కువ నిమ్మకాయలను పజిల్ నుండి బయటపడేసింది యష్మీ టీమ్ గెలిచింది. మూడు టీమ్స్ కొన్ని తప్పులు చేసినా మొత్తానికి యష్మీ టీమ్‌కు రేషన్ దక్కింది. రెండో ఛాలెంజ్‌లో నిఖిల్ వెళ్దామని సిద్ధమవ్వగా నాగ మణికంఠ మాత్రం తాను నామినేషన్స్‌లో ఉన్నానని, ఆడితే తను హౌజ్‌లో ఉండే స్కోప్ ఉంటుందని నిఖిల్‌ను ఒప్పించాడు. సీతతో పోటీపడి మరీ మణికంఠ బాగా ఆడడానికి ప్రయత్నించాడు. కానీ సంచాలకురాలిగా వ్యవహరించిన యష్మీ తీసుకున్న నిర్ణయం వల్ల నిఖిల్ టీమ్ ఓడిపోయింది. సంచాలకురాలిగా యష్మీ నిర్ణయం తప్పు అని తామే గెలిచామని మణికంఠ వాదిస్తున్నా కూడా తనకు సపోర్ట్‌గా నిఖిల్ అసలు ముందుకు రాకపోవడం ప్రేక్షకులకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది.


Also Read: బిగ్ బాస్ అభయ్ కి అభయమిచ్చిన తారక్..ఎందుకో తెలుసా?

గేమ్‌కు అడ్డురాను

నిఖిల్ ఆడకపోవడంపై సోనియాకు, తనకు మధ్య గొడవ కూడా జరిగింది. ఫైట్ చేయకుండా లూజర్‌లాగా మిగిలిపోయాడంటూ వ్యాఖ్యలు చేసింది. కానీ సోనియా.. నిఖిల్‌తో ఎందుకిలా ప్రవర్తిస్తుంది అనే విషయంపై మాత్రం పూర్తిగా క్లారిటీ లేదు. అదే సమయంలో యష్మీ వచ్చి సోనియాను వారి టీమ్‌కు కేటాయించిన రూమ్‌లోనే పడుకోమని, ఇతరులతో ఎమోషనల్ కనెక్షన్స్ వద్దని చెప్పింది. ఇదే విషయాన్ని వచ్చి నిఖిల్‌తో చెప్తూ ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోవాలో వద్దో తన ఇష్టమని, చెప్పడానికి యష్మీ ఎవరు అని నిలదీసింది. అంతే కాకుండా నిఖిల్.. తన గేమ్‌కు అడ్డుగా వస్తున్నాడని తనతోనే డైరెక్ట్‌గా చెప్పింది. దీంతో నిఖిల్ కూడా తనకు ఏది నచ్చితే అదే చేయమని సోనియాకు సలహా ఇచ్చాడు.

ఏంటిది నిఖిల్

పూర్తిగా సోనియా మాయలో పడిపోయిన నిఖిల్.. ఎమోషనల్ ఫూల్ అయిపోయాడు. ఇదే విషయం నైనికాతో చర్చించాడు కూడా. తన ఫ్యామిలీ అనుకునేవారి కోసం ఏదైనా చేస్తానని, సోనియాను కూడా అలాగే అనుకున్నానని చెప్పుకొని బాధపడ్డాడు. మొత్తానికి నిఖిల్.. తన టీమ్ కోసం, మణికంఠ కోసం స్టాండ్ తీసుకోకపోవడం వల్ల వాళ్లిద్దరూ వారం మొత్తం రాగి జావాతో పాటు పచ్చి కూరగాయలు తింటూ బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ సెకండ్ రౌండ్‌లో తను ఆడడానికి వెళ్లినా కూడా నైనికా టీమ్‌లో ఎక్కువమంది ఉన్నారు కాబట్టి వాళ్ల టీమ్‌కు రేషన్ దక్కడం కోసం తాను ఓడిపోయేవాడిని అని వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి మొదటివారంలో లీడర్‌లాగా ఉన్న నిఖిల్‌ను రెండో వారానికి ఎమోషనల్ ఫూల్ చేసి ఆడుకుంటుంది సోనియా.

Related News

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Mallika Sherawat: బిగ్ బాస్‌లోకి హాట్ బ్యూటి మల్లికా షెరావత్.. అబ్బాయిలు ఇక టీవీ వదలరేమో!

Big Stories

×