BigTV English

Viral Video: పాన్ దోశ అంట ఎప్పుడైనా తిన్నారా.. చూడండి ఎలా తయారు చేశాడో

Viral Video: పాన్ దోశ అంట ఎప్పుడైనా తిన్నారా.. చూడండి ఎలా తయారు చేశాడో

Viral Video: దోశలు అంటే ఇష్టం లేని వారెవరు ఉండరు. టిఫిన్లలో ఎక్కువగా ఏది ఇష్టం అంటే ముందుగా దోశ పేరే చెబుతారు. అంత ఇష్టం అండీ మరి. దోశలో చాలా రకాల దోశలు ఉంటాయి. ఉల్లి దోశ, కారం దోశ, మసాలా దోశ, టోపీ దోశ, పనీర్ దోశ, చీజ్ దోశ, అబ్బో చెప్పడానికి కూడా చాలా తక్కువే అనిపిస్తుంది. తరచూ ఏదో ఒక కొత్త రకం దోశ పుట్టుకొస్తునే ఉంటుంది. ఇలా దోశ ప్రియులకు రకరకాల దోశలు తినాలనే కుతూహలం కూడా ఉంటుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి కొత్త రకం దోశను తయారుచేశాడు.


వైరల్ అవుతున్న వీడియోలో ఓ టిఫిన్ సెంటర్లో వ్యక్తి దోశను తయారుచేశాడు. అది కూడా పాన్ దోశ అని అన్నాడు. పాన్ లో వాడే పదార్థాలను దోశపై వేస్తూ ఈ దోశను తయారు చేసిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. అయితే ఆ వ్యక్తి ముందుగా దోశ పిండిని పెనంపై వేసి దోశను పరిచాడు. ఆ పిండి చూడడానికి ఆకుపచ్చ రంగులో ఉంది. అనంతరం పెనంపై కాలుతున్న దోశపై వివిధ రకాల పదార్థాలను వేశాడు. అందులో చెర్రీలు, ఎండు ద్రాక్ష, డ్రైఫ్రూట్స్, ఖూర్బానీ వంటి రకరకాల పండ్లకు సంబంధించినవి ఉన్నాయి.

ఈ తరుణంలో పెనంపై కాలుతున్న దోశపై పదార్థాలను వేసి బాగా కలిపి దోశను తయారు చేశాడు. అనంతరం దోశను ఓ ప్లేట్లో వేసి సర్వ్ చేశాడు. దోశను నంచుకోవడానికి చీజ్, పాన్ సిరప్ కూడా అందులో వేశాడు. దీనిని ఓ కస్టమర్లకు సర్వ్ చేశాడు. దీంతో పాన్ దోశ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు దోశను ఇష్టంగా తినే వారు కూడా దీనిని చూస్తే ఇంకోసారి తినలేరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరొ నెటిజన్ కామెంట్ చేస్తూ ఇంకా మరెన్ని రకాల దోశలు పుట్టుకొస్తాయో, ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×