E-Paper
Advertisement

Pre-wedding Shoot Video Viral: ప్రీ వెడ్డింగ్ షూట్.. బురదలో శవాలు? వీడియో వైరల్

Pre-wedding Shoot Video Viral: ప్రీ వెడ్డింగ్ షూట్.. బురదలో శవాలు? వీడియో వైరల్
Advertisement

Pre-wedding Shoot Video Viral: పెళ్లికి ముందు చేస్తున్న ఫోటోషూట్‌లు వింతగా మారుతున్నాయి. ఒకప్పుడు వివాహానికి కొద్ది గంటలు ముందు ఫోటోషూట్‌కు పెద్దలు అనుమతి ఇచ్చేవారు. ఇప్పుడు పెళ్లికి ముందే కాబోయే నూతన దంపతులు ప్రీ వెడ్డింగ్ షూట్‌కు రెడీ అవుతున్నాయి. ఆ షూట్‌లో కాసింత క్రియేటివిటీ జోడిస్తున్నారు. ఫలితంగా కొన్ని ఫ్రీ వెడ్డింగ్ షూట్లు వైరల్ అవుతున్నాయి. అలాంటిదొకటి వెలుగులోకి వచ్చింది.

మరొక రేంజ్‌కి చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్

Advertisement

ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్ అనగానే అందమైన లొకేషన్లు గుర్తుకొస్తాయి. పూల చెట్లు, పచ్చని అందాలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, సముద్రం ఇలా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. ట్రెండ్‌కు భిన్నంగా వెళ్లాలని ఆలోచన చేసింది ఓ జంట. ఏకంగా బురద గుంటలో ఫోటో షూట్‌కి తెరలేపారు. ఆ జంట కళ్ళు మూసుకుని నీటిపై తేలుతూ ఉండగా కెమెరామెన్‌ టీమ్ వారి భంగిమను చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. వారి పొజిషన్ తగినంత సౌందర్యాత్మకంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఈ షూట్‌పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనిపిస్తున్న వీడియోలో కాబోయే నూతన వధూవరులు బురదగుంటలో పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. వైట్ డ్రెస్ ధరించి ఇద్దరు మురికి నీటిలో తేలుతూ ఫోజులిచ్చారు. ఏ విధంగా బాగుంటుందని అనేదానిపై ఫోటోగ్రాఫర్లు సూచనలు ఇస్తున్నాడు. ఈ దృశ్యం రొమాంటిక్‌గా కాకుండా ఏదో క్రైమ్ సీన్‌ని తలపిస్తోంది. ఇంతకీ ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తున్నారా? వ్యూస్, రీల్స్ కోసం ఈ జంట ఇలాంటి కొత్త స్కెచ్ వేసిందా? అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Advertisement

వైట్ డ్రెస్‌లో బురద గుంటలో నీటిపై తేలుతూ షూట్, ఆపై నెటిజన్స్ ఆగ్రహం

ఫోటోషూట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఇది ప్రీ-వెడ్డింగ్ షూటా? క్రైమ్ పెట్రోల్ ఎపిసోడ్ ప్రోమోనా? అని అంటూ ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ టైటానిక్ రేంజ్‌లో ఫీల్ అవుతున్నాడని మరొకరు ఎద్దేవా చేశారు. ప్రీ వెడ్డింగ్ షూట్‌లు క్యాండిడ్ దశను దాటి నేరుగా సినిమాటిక్ ఆర్ట్ దశలోకి వచ్చినట్టు స్పష్టమవుతోంది. ప్రీ-వెడ్డింగ్ షూట్‌లో ఇలాంటివి చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.

గతంలో నీటి అడుగున ఫోటోషూట్‌ల నుండి సినిమాటిక్ పునఃసృష్టిల వరకు చేశారు. యాక్షన్-సీక్వెన్స్ తరహా కొత్తగా ఏదైనా చేయాలనే ఒత్తిడి క్రమంగా పెరుగుతోందని అంటున్నారు. జీవితాంత గుర్తుంచి పోయే అందమైన జ్ఞాపకాల కోసం ఇలాంటి షూట్లు కొన్నిసార్లు ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. గతంలో కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో ఫోటోషూట్‌లు చేస్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాపాయ స్థితికి తెచ్చే షూట్లకు దూరంగా ఉండాలన్నది నిపుణుల మాట.

ALSO READ: యూనివర్శిటీల్లో వింత కోర్సులు.. ఏంటీ ఇవి కూడా నేర్పిస్తారా? అస్సలు నమ్మలేం!

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×