BigTV English

Snake video: వామ్మో..గాల్లో తేలుతూ బుసలు కొడుతోంది.. వైరల్ వీడియో

Snake video: వామ్మో..గాల్లో తేలుతూ బుసలు కొడుతోంది.. వైరల్ వీడియో

Snake flying in the air like a bird and hissing: గాల్లో తేలినట్లుందే అంటూ బైక్ పై రయ్యిమని వెళ్లే వారికి సైతం వంట్లో వణుకు పుట్టించే వీడియో అది. పాములు అంటే నేల మీదే పాకుతాయని అందరికీ తెలుసు..కానీ పక్షిలా గాల్లో తేలుతూ ఓ ఇంటి కప్పు పైనుంచి హఠాత్తుగా ఓ పాము ఆకాశం నుండి కింద పడింది. అలా పడే ప్రక్రియలోనే ఆకాశంలో బుసలు కొడుతూ కిందకు జారిపడింది. చెప్పడానికి బాగానే ఉన్నా వీడియో చూస్తే ఒళ్లు గుగుర్పాటు కలుగుతుంది. ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది ఎవ్వరికైనా..సాధారణంగా విష సర్పాలు చూస్తే చాలు హడలిపోతుంటాము. చాలా మంది సినిమా తెరపై పాములనుచూసి సీట్లపై కాళ్లు ఎత్తుకుని కూర్చొంటారు. అంటే పాములంటే అంత భయం. మనుషులు పాములను చూసి ఎలా భయపడతారో పాములు కూడా అంతే స్థాయిలో మనుషులను చూసి భయపడుతుంటాయి.


వైరల్ వీడియో

ఉదయం లేవగానే ఎవరి కంటా పడకూడదని కోరుకుంటాయి. సాధారణంగా భూమిపై రంధ్రాల గుండా లోపలకి వెళ్లి దాక్కుంటాయి పాములు. ఒక్కోసారి పొలాలలో ఎలుకలు రంధ్రాలు చేసుకుని ఉంటాయి. పాములు ఆ ఎలుకలను పట్టుకునేందుకు రంధ్రాలలో ప్రవేశిస్తుంటాయి. కానీ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికో అన్నట్లుగా ఓ బిల్డింగ్ పైకి ఎక్కిన పాము ఆకాశంలోనే బుసలు కొడుతూ కిందకి వచ్చి పడింది. ఇంకా నయం ఆ దారిన ఎవరైనా ప్రయాణించలేదు. లేకుంటే వారి మెడకో తలకో చుట్టుకుని కాటేసి ఉండేదని అంతా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.


Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×